ఏపీ సీఎం జగన్ రాను సమస్యల వలయంలోనే మునిగిపోతున్నారు. బయటకు వచ్చే దారి కనిపించడం లేదు. బయటకు వచ్చేందుకు లాబీయిస్ట్ విజయ్ కుమార్ లాంటి గడ్డి పోచలు దొరికినా వదిలి పెట్టడం లేదు. కానీ వాటిని పట్టుకుని ఆయన మరింత ఆగాథంలోకి వెళ్లిపోతున్నారు కానీ బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి వైసీపీకి.. దాని అధినేతకు ఎందుకు వచ్చిందా అని ఆ పార్టీ క్యాడర్ కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు చుట్టుముట్టిన సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి … చక్కబెట్టుకోలేకపోతున్నారు. ఎందుకీ పరిస్థితి అని వైసీపీ కార్యకర్తలు ఆరా తీసుకుంటే… వారికి కనిపిస్తున్న తేడా విజయసాయిరెడ్డి.
గతంలో ఏ సమస్య వచ్చినా విజయసాయిరెడ్డి గుట్టు చప్పుడు కాకుండా పనులు చక్క బెట్టుకుని వచ్చేవారు. తెర ముందు ఆయన కాళ్ల పై పడని పెద్ద మనుషుల జాబితా లేదంటే అతిశయోక్తి కాదు . ఇలా ఎవరు పడితే వాళ్ల కాళ్లపై పడటం విజయసాయిరెడ్డికి సరదా కాదు.. జగన్ ఇచ్చిన టాస్క్ ను కంప్లీట్ చేయడం ఆయనకు ముఖ్యం. చేసి చూపించేవారు. గత ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి చేసిన మల్టీ టాస్కింగ్ అసామాన్యం. తెలంగాణ సర్కార్ తోసమన్వయం చేసుకుంటూ.. ఐ ప్యాక్ తో పని చేయించుకుంటూ… తెలంగాణపోలీసులతో టీడీపీని ఇబ్బంది పెడుతూ… వైసీపీ అభ్యర్థులు.. ఆర్థిక అవసరాలు ఇలా మొత్తం ఆయన చేసిన పనులు చూసి ఔరా అనిపించక మానదు. కానీ ఇప్పుడు ఆయన కనిపించడం లేదు.
వైసీపీలో సంక్షోభం ముదురు తూంటే… సజ్జల రెడ్డి, చెవిరెడ్డి, వైవీసుబ్బారెడ్డిలతో జగన్ సమావేశం అయ్యారు. కానీ.. విజయసాయిరెడ్డిని పిలువలేదు. ఆయనను పూర్తిగా దూరం పెట్టేశారు. ఈ పరిణామాలతో హర్ట్ అయిన విజయసాయిరెడ్డి తన మానన తాను ఢిల్లీలో ఉంటున్నారు. పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. సోషల్ మీడియాలో కూడా… హిందీ, ఇంగ్లిష్ లో ట్వీట్లు పెట్టి.. మ మ అనిపిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ క్యాడర్ కూ.. విజయసాయిరెడ్డి రంగంలోకి దిగితే బాగుండు అనిపిస్తుంది. కానీ.. అలా అనిపించాల్సింది జగన్ కు. నిండా మునిగిన తర్వాత కాపాడేవాళ్ల కాళ్లు పట్టుకోవడం జగన్ నైజం అని.. చివరికి విజయసాయిరెడ్డి విషయంలోనూ అదే జరుగుతుందని కొంత మంది వైసీపీ క్యాడర్ నమ్ముతున్నారు.