వైసీపీ అధినేత జగన్ లో ధైర్యం రోజు రోజుకు తగ్గిపోతోంది. గతంలో ఎవరైనా వైసీపీ ఎమ్మెల్యే తన పాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే.. జగన్ ఆగ్రహం.. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయం అని ప్రచారం జరిగింది. సస్పెండ్ చేసేదేమీ ఉండదు కానీ.. అలా ప్రచారం అయితే చేసుకునేవారు. ఇప్పుడు అది కూడా లేదు. కనీసం జగన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం లేదు. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలోనూ ప్రచారం చేసుకోడం లేదు. రోజు రోజుకు జగన్ పాలనను ధిక్కరిస్తున్న ఎమ్మెల్యేలు పెరిగిపోతున్నారు. వారిని కట్టడి చేసేందుకు ఎవరో ఒకరిపై చర్యలు తీసుకుంటారనుకున్నా.. ముందడుగు వేయడం లేదు.
పెన్షన్లు అసలు తొలగించడం లేదని జగన్ చెప్పారు..కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ గాలి మొత్తం తీసేసి.. ప్రభుత్వాన్ని అవమానించాడు. అయినా శ్రీధర్ రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు ఆనం ఇంకా దారుణంగా మాట్లాడారు. ఆయన మాటలు విని ప్రభుత్వంపై విమర్శలు చేసింది.. ప్రతిపక్ష ఎమ్మెల్యేనా అనుకునే పరిస్థితి. అయినా ఆనంపై వైసీపీ హైకమాండ్ ఎలాంటి అసహనం.. కోపం.. ఆగ్రహం వ్యక్తం చేయలేదు. చర్యలు తీసుకుంటే.. ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని .. ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం జగన్ పై వంద మందికిపైగా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలుగా సంపాదించుకున్న వారు అతి కొద్ది మందే. అది కూడా ఒకే సామాజికవర్గం వారు. ఇతరులు పూర్తిగా ఆర్థికంగా కుంగిపోయారు. ఎన్నికలకు అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేస్తానని జగన్ చెబుతున్నారు కానీ.. ఆస్తులు రాయించుకుంటారని..గత అనుభవాలతో వైసీపీ నేతలు భయపడుతున్నారు. అందుకే.. ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేశారని..వారిపై చర్యలు తీసుకుంటే.. మిగతా వారు కూడా.. అదే పని చేస్తే.. కంట్రోల్ చే్యడం కష్టమని.. వైసీపీ పెద్దలు ఆగిపోతున్నట్లుగా తెలుస్తోంది.