పోర్న్ స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకొన్న సన్నీ లియోన్ సినిమాల్లోనూ విజృంభిస్తోంది. బాలీవుడ్లో ఆమె హవా కొనసాగుతోంది. తాను కాలుపెడితే.. ఎలా ఉంటుందో టాలీవుడ్‌లోనూ తేలిపోయింది. కరెంటు తీగకి మంచి ఓపెనింగ్స్ రావడానికి సన్నీ ఓ కారణమైంది. అయితే చాలా గ్యాప్ తరవాత.. సన్ని తెలుగులో మరో సినిమా చేసింది. అదీ ఐటెమ్ గాళ్‌గా. అదే గరుడ వేగ. రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం వస్తోంది. ఈ సినిమాలో సన్నీలియోన్ ఉన్నా – దాన్ని పబ్లిసిటీలో వాడుకోవంలో చిత్రబృందం విఫలమైందనే చెప్పాలి. సన్నీకి సంబంధించిన పాట ఆడియో రూపంలో క్లిక్ అవ్వలేదు. వీడియో పరంగా ఎలా ఉంటుందో ఓ ఐడియా లేదు. పోస్టరు కోసం కూడా సన్నీ అందాల్ని వాడుకోవడం లేదు. సన్నీ కేవలం స్పెషల్ అట్రాక్షన్ గా ఉండాలి తప్ప… గరుగ వేగ అనే సినిమాకి ఆమె కోసమే రాకూడదన్నది దర్శకుడి ఉద్దేశం కావొచ్చు.
వినడానికి అది బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ సమస్యేంటంటే… రాజశేఖర్ క్రేజ్, ఆయన ఇమేజ్ చూసి జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది జనాలకు ఇంత వరకూ అర్థం కాలేదు. రాజశేఖర్నో, ప్రవీణ్ సత్తారు పేరునో చూసి జనాలు థియేటర్‌కి వస్తారనుకోవడం అత్యాసే. అలాంటప్పుడు సన్నీ ని ఓ ఆకర్షణ మంత్రంగా వాడుకోవడంలో తప్పులేదు. కానీ… చిత్రబృందం ఆ పని చేయడం లేదు. అయినప్పటికీ.. జనాలు థియేటర్‌కి వచ్చారంటే, తొలి రోజు హాళ్లు నిండాయంటే.. అందులో కచ్చితంగా సన్నీ ఎఫెక్ట్ ఉండే ఉంటుంది. అది ఏ స్థాయిలో అన్నది శుక్రవారం తేలిపోద్ది. ప్రచార ఆర్భాటం లేకపోయినా, సన్నీ కోసం జనాలు థియేటర్‌కి వచ్చారంటే… ఇక ముందు కూడా నిర్మాతలు ఇలానే క్యూ కట్టడం ఖాయం.