కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న అధికారి కావడంతో మొదట పట్టించుకోలేదు. కానీ విషయం జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ వద్దకు చేరడంతో .. టీడీపీ నేతలు నామినేషన్ లో వ్యక్తం చేసిన అభ్యంతరంపై నోటీసులు జారీ చేశారు. అటు కొడాలి నానితో పాటు ఇటు టీడీపీ నేతలకూ నోటీసులు ఇచ్చారు.
తాము వ్యక్తం చేసిన అభ్యంతంపై టీడీపీ నేతలు పూర్తి ఆధారాలను సమర్పించారు. కొడాలి నాని ప్రభుత్వ భవనాన్ని వాడుకున్న విషయాన్ని ఆధారాలతో సహా ఇచ్చారు. అయితే కొడాలి నాని కూడా రాత్రికి రాత్రి మున్సిపల్ కార్యాలయం నుంచి అద్దెకు తీసుకున్నది నిజమే కానీ బకాయులు ఏమీ లేకుండా చెల్లించేశారని నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పత్రాలు పుట్టించి వాటిని అధికారులకు సమర్పించినట్లుగా తెలుస్తోంది. అసలు సమస్య డ్యూస్ కాదని.. ప్రభుత్వ అకాడమిడేషన్ లో ఇప్పటికీ ఉంటూ.. ఉండలేదని చెప్పడం అని టీడీపీ నేతలంటున్నారు
ఇక్కడ కూడా కొడాలి నాని తెలివి తేటలు చూపించారు. అది అకామిడేషన్ కాదని క్యాంపు కార్యాలయం అని చెబుతున్నారు. ఆదివారం కావడంతో ఈ అభ్యరంతలపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ రిటర్నింగ్ అధికారి ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేషన్ తిరస్కరించే అవకాశం లేదని.. ఆర్వోకు కొడాలి నాని ఎంత చెబితే అంత అని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే జిల్లా ఎన్నికల అధికారికి నేరుగా రిపోర్టు చేస్తున్నారు. సోమవారం కొడాలి నాని నామినేషన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.