నాగచైతన్య బాలీవుడ్ కల… ఏమాత్రం కష్టపడకుండానే పూర్తయిపోయింది. `లాల్ సింగ్ చడ్డా`లో ఆ అవకాశం చైతూని వెదుక్కొంటూ వచ్చింది. అయితే… ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. పైగా చైతూకి ఈ సినిమా ప్లస్ అవ్వకపోగా.. మైనస్ అయ్యింది. దాంతో ఈ సినిమాని వీలైనంత త్వరగా మర్చిపోవాలని చూస్తున్నాడు చైతూ.
ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. రణబీర్‌కపూర్ `బ్రహ్మాస్త`లో నాగ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ట్రైలర్లలో కూడా నాగ్ పాత్రని బాగానే ఎలివేట్ చేశారు. అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ఉండడం, భారీ బడ్జెట్ కేటాయించడం,ప్రమోషన్లు కూడా జోరుగా చేయడం కలిసొచ్చే విషయాలే. అయితే చైతూలా నాగ్ కి ఇది తొలి బాలీవుడ్ సినిమా కాదు. ఇది వరకు అక్కడ చాలాసార్లే కనిపించాడు. కొన్ని స్పెషల్ ఎప్పీరియన్సులూ ఇచ్చాడు. అందులో ఇదొకటి. పైగా… అమితాబ్ బచ్చన్ తో నాగ్ కాంబో బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన `ఖుదాగవా` మంచి హిట్ అయ్యింది. ఆ తరవాత.. `మనం`లోనూ అతిథి పాత్రలో కనిపించారు బిగ్ బీ. ఆ సినిమా అక్కినేని ఫ్యామిలీకి మణిహారంలా నిలిచింది. ఈ సెంటిమెంట్ బ్రహ్మాస్త్రకి పనికొచ్చే అవకాశం ఉంది. నాగ్ పాస్ అయినా, ఫెయిల్ అయినా.. తన కెరీర్లో వచ్చే పెను మార్పులేం ఉండవు. బ్రహ్మాస్త్ర సినిమా హిట్టయిందని నాగ్ కి కొత్తగా ఛాన్సులు రావు. పోతే.. వచ్చే ఛాన్సులు ఆగిపోవు. కాకపోతే.. ఈమధ్యే చైతూ బాలీవుడ్ లో ఫెయిల్ అయ్యాడు. నాగ్ పాస్ అయితే.. కాస్త ఊరట లభిస్తుంది. అంతే.