మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఈవీఎంలో నిక్షిప్తమైన ఓటర్ తీర్పుపై అంచనాకు వచ్చేందుకు ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జట్ గా ఉంటాయనే నమ్మకంతో పలు పార్టీలకు చెందిన నేతలు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
అయితే, ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అయ్యాక ఏపీలో రాజకీయ పరిస్థితులు తారుమారు కానున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి కూటమి వస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేలిస్తే వైసీపీని వీడెందుకు చాలామంది నేతలు రెడీగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. జూన్ 4న ఫలితాలు వెల్లడయ్యాక పార్టీ ఫిరాయిస్తే ప్రాధాన్యత దక్కదని అందుకే కాస్త ముందుగానే గోడ దూకాలని ప్లాన్ లో వైసీపీ అసంతృప్త నేతలు ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికీ కూటమి విజయం ఖాయమని అంచనాలతో కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ కీలక నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారని, కాకపోతే ఎగ్జిట్ పోల్స్ తర్వాత పార్టీ మారుదామనే ఆలోచనతో వేచి చూస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. దీంతో ఇలా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతాయో లేదో అలా పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ అవుతాయన్న ప్రచారం ఏపీలో జోరుగా జరుగుతోంది.