మార్చి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. విశాఖలో పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనలో.. రైల్వేజోన్ ప్రకటిస్తారనే అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. క్రెడిట్ కోసం.. భారతీయ జనతా పార్టీ నేతలు… ఇప్పటికే.. ఢిల్లీ యాత్రలు ప్రారంభించారు. కేంద్రమంత్రులను కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి.. రైల్వే జోన్ కోసం.. తాము అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు… కనిపించడానికి… హడావుడి చేస్తున్నారు. ఏపీ బీజేపీ నేతల బృందం… ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లింది. రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసిరైల్వేజోన్ ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. రైల్వే జోన్ ఇవ్వబోమని కేంద్రం చెప్పలేదంటున్నారు.
రైల్వే జోన్ విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుంది. సాంకేతికంగా చూసినా… ఆర్థిక పరంగా చూసినా.. రైల్వేజోన్ ఇవ్వకుండా ఉండటానికి ఎలాంటి కారణాలు లేవు. సాంకేతికంగా రైల్వేజోన్‌కు ఎంత మేర… రైల్వే ట్రాక్ ఉండాలో.. ఏపీలో అంత కంటే ఎక్కువే ఉంది. జోన్లో.. ఇతర రాష్ట్రాల పరిధి అవసరం లేదని పదే పదే చెప్పుకొచ్చారు కూడా. తమ రాష్ట్రంలోని.. తమ జోన్లోనే ఉంచితే.. విశాఖ రైల్వేజోన్‌కు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని… ఒడిషా కూడా తేల్చి చెప్పింది. అదే సమయంలో.. రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ… ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భాగంగా ఉన్న విశాఖలో… ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా.. రైల్వే శాఖ అదనంగా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఈ విషయంపై క్లారిటీ ఉన్నప్పటికీ.. కేంద్రం ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు.
దశాబ్దాల ప్రజల సెంటిమెంట్ రైల్వే జోన్. ఈ విషయం బీజేపీ నేతలకూ తెలుసు. అందుకే.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా ఆ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు ముందుగా ఇచ్చే హామీ రైల్వేజోన్. గెలిచిన తర్వాత మాత్రం తమ పార్టీ హైకమాండ్‌ను ఒక్క మాట కూడా అడగకుండా… నిర్లజ్జగా… హామీలన్నీ అమలు చేశామని.. చెబుతూ ఉంటారు. అయితే.. ఇప్పుడు ప్రజలు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏ అడ్డంకి లేకపోయినా.. రైల్వేజోన్ ఇవ్వకపోతే.. అది కచ్చితంగా వివక్ష అనే ముద్ర పడిపోతుంది.. కాబట్టి.. ఆ ఒక్క హామీ ఇద్దామనే ఆలోచన బీజేపీ చేస్తోందంటున్నారు. అందుకే.. మేమే ఇస్తున్నాం.. రాజకీయ ప్రయోజనం మాకే కలగాలన్నట్లుగా బీజే్పీ.. ఇప్పుడు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. కనీసం.. ఒక్క నిఖార్సైన హామీని అయిన బీజేపీని అమలు చేసినట్లవుతుంది. కానీ.. ప్రకటించే వరకు డౌటే..!