సీఎం చంద్రబాబు వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం కనపడుతోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో… అమరావతి, విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకరావాలనుకుంటున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఎం ఆయనతో చర్చించారు. ఇక పెట్టుబడులకు స్వర్గదామంగా, అన్ని సదుపాయాలున్న విశాఖ నగరంలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సీఎం టాటా చైర్మన్ ను కోరారు.
ఇక టాటా సంస్థల్లో భాగంగా ఉన్న ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ ను ఏపీలో కూడా తన కార్యాకలాపాలు విస్తరించేలా చూడాలని సీఎం కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతుండగా, ఈ టాస్క్ ఫోర్స్ కు సీఎం చంద్రబాబు చైర్మన్ గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా ఉండనున్నారు. 2047 నాటికి ఏపీని నెంబర్ 1 స్టేట్ చేసే లక్ష్యంతో విజన్ 2047 డాక్యుమెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తోంది.