ఇటీవల తాప్సి ‘కొబ్బరికాయ్’ పై చేసిన కామెంట్లు గుర్తుండే ఉంటుంది. ఝమ్మంది నాదంలో రాఘవేంద్రరావు తన బొడ్డుపై కొబ్బరి కాయ విసిరిన సంగతి గుర్తు చేస్తూ కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసింది. దాంతో రాఘవేంద్రరావు సన్నిహితులు, ఆయన్ని అభిమానించే వారు నొచ్చుకొన్నారు. ఆ తరవాత తాప్పి దిగి వచ్చింది. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి కామెంట్లు చేయలేదని, ఎవ్వరినీ నొప్పించడానికి మాట్లాడలేదని, తనని క్షమించమని కోరుకొంది. ఇంతలో మరో కొబ్బరికాయ్ పేలింది. ఈసారి కొబ్బరికాయ పై కామెంట్ చేసిందెవరో కాదు.. అమీ జాక్సన్. 2.ఓ’ చిత్రంలో నటిస్తున్న అమీ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా బొడ్డుపై కొబ్బరికాయ విసిరితే ఎలా స్పందిస్తారు అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఏమాత్రం తడముకోకుండా జవాబు చెప్పింది అమీ.
”నాకైతే ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు. ఒకవేళ నాపై ఎవరైనా అలా కొబ్బరికాయ విసిరాలనుకొంటే.. వద్దని ముందే చెప్పేస్తా. కాదంటే అదే కొబ్బరికాయను వారిపై విసిరికొడతా. నేను ఇలా చేస్తానని తెలిసే నాతో అలా ఇప్పటివరకు ప్రవర్తించలేదేమో. చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాక మంచి దర్శకులతో కలిసి పనిచేశాను. అది నా అదృష్టం” అని చెప్పుకొచ్చింది అమీ. దర్శకేంద్రుడి సినిమాతోనే తాప్సి టాలీవుడ్లోకి అడుగుపెట్టింది కాబట్టి.. తాప్పి వ్యాఖ్యల్ని తప్పుపట్టారంతా. ఇప్పుడు అమీని ఏమంటారు? అమీకీ రాఘవేంద్రరావుకీ ఎలాంటి అనుబంధం, సంబంధం లేదు. అమీ వ్యాఖ్యాల్ని ఈజీగా తీసుకొంటారా? లేదంటే తాప్సి ని నిలదీసినట్టే నిలదీస్తారా? చూడాల్సిందే.