లైగర్ వివాదం కొనసాగుతోంది. లైగర్ వలన కలిగిన నష్టాలని పూడ్చమని ఎగ్జిబిటర్లు ధర్నాకి దిగారు. నిర్మాతలలో ఒకరైన చార్మీ ఈ విషయాన్ని సెటిల్ చేస్తామని చెబుతున్నారు. అయితే కొందరు ఈ విషయంలో విజయ్ దేవరకొండని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లైగర్ కోసం విజయ్ తీసుకున్న పారితోషకాన్ని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఆచార్య సినిమా ఉదాహరణగా చూపుతున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఆచార్య నష్టాలని పూడ్చడానికి తమ పారితోషకాన్ని వెనక్కి ఇచ్చారని, ఇప్పుడు విజయ్ కూడా అదే చేయాలని చెబుతున్నారు.
అయితే ఆచార్య పరిస్థితి వేరు.. లైగర్ వేరు. ఆచార్య సినిమాకి చిరంజీవి, రామ్ చరణ్ నిర్మాతలు. వాళ్ళు వెనక్కి ఇచ్చారంటే అర్ధముంది. లైగర్ లో విజయ్ హీరో. అది తప్పితే దాని లావాదేవీలతో విజయ్ కి ఎలాంటి సంబంధం లేదు. పైగా విజయ్ కి పూర్తి రేమ్యునిరేషన్ ఇవ్వలేదు. 25 శాతం ఇచ్చి, మిగతాది విడుదల తర్వాత చూద్దామని చెప్పారు. విడుదల తర్వాత లైగర్ పరిస్థితి తెలిసిందే.
పైగా లైగర్ కోసం కావాల్సిన డేట్లు ఇచ్చాడు విజయ్. ప్రమోషన్స్ కోసమే నెల రోజులు కేటాయించాడు. ఈ రోజుల్లో విజయ్ లాంటి హీరో నెల రోజులు ఇవ్వడం అంటే.. ఆ గ్యాప్ లో మరో సినిమా చేసుకున్న బోలెడు డబ్బు. కానీ సినిమాపై ఇష్టంతో అన్నీ రోజులు కేటాయించాడు. పైగా లైగర్ విషయంలో మొదటి నుంచి సాఫ్ట్ కార్నర్ లో వున్నాడు విజయ్. ఈ సినిమాకి నాకు రేమ్యునిరేషన్ ఇవ్వద్దు.. డబ్బులు వుంటే అప్పులు తీర్చేమని విజయ్ చెప్పాడని స్వయంగా పూరి జగన్నాథ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.
ఏరకంగా చూసిన లైగర్ కి విజయ్ ఇప్పటికే చేయాల్సిన దాని కంటే ఎక్కువ చేశాడు. ఇప్పుడు తీసుకున్న పావొంతు పారితోషికం వెనక్కి ఇవ్వాలనే డిమాండ్ అర్ధరహితమన్న మాట విజయ్ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తోంది.