విశాఖలో ప్రభుత్వం వందల కోట్ల ఖర్చుతో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనిసరావు చేసిన ఓ ట్వీట్ వైరల్గ మారుతోంది. ఈ అంశంపై ఆయన తెలుగులో వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇరవై అంశాలపై సూటిగా ప్రశ్నించారు. అందులో రాజధాని లేకపోవడం దగ్గర్నుంచి జాకీ పరిశ్రమను తరిమి వేయడం వరక అనేక కీలక సందేహాలు ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.
టీడీపీ హయాంలో విశాఖలో 50వేల మంది ఐటీ ఉద్యోగులు ఉండేవారు .. ఇప్పుడు రెండు మూడు వేల మంది కూడా లేరు..ఐటీ కంపెనీైలను ఎందుకు తరిమేశారు ? హెచ్ఎస్బీసీ వెళ్లిపోకుండా ఎందుకు ఆపలేకపోయారు ? కియా అనుబంధ పరిశ్రమలు ఒక్క దానిని కూడా ఎందుకు ఏర్పాటు చేయించలేకపోయారు, లూలూ పరిశ్రమను వెళ్లగొట్టిన అంశం పెట్టుబడిదారుల సదస్సులో చెబుతారా ? బోగాపురం ఎయిర్ పోర్టును నాలుగేల్ల పాటు పట్టించుకోకుండా.. ఇప్పుడు శంకుస్థాపన పేరుతో హడావుడి చేయడం ఎందు్కు ?, లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులు ఆకర్షిస్తారా?, జీతాలు ఇవ్వలేని రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా ? అదానీ డేటా సెంటర్కు గతంలోనే శంకుస్థాపన చేసినా ఇంత వరకూ పనులు మొదలు పెట్టలేదని ఇంకా ఎందుకు భూములు కేటాయించారో చెప్పాలని గంటా డిమాండ్ చేశారు.
గంటా సంధించిన ప్రశ్నలన్నీ స్పష్టంగా ఉండటంతో సింపుల్గా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల పాటు ఓ కులాన్ని మాత్రమే ధ్వంసం చేస్తున్నాననుకుని ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని నాకించేసిందని .. గంటా సంధించిన ఈ ఇరవై ప్రశ్నలతోనే తేటతెల్లం అవుతుంది. అయితే వీటికి సమాధానంగా మాత్రం వైసీపీ దగ్గర ఉంది.. అదే చంద్రబాబు. రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని.. చంద్రబాబు లేఖ రాస్తే గంటా సంతకం పెట్టారని… గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చేతకాని ప్రభుత్వం… ఎదురుదాడి.. తిట్లు తప్ప ఏమీ చేయలేదన్నకామెంట్లు అమర్నాథ్ లాంటి వారి స్పందనల వల్లే వస్తూంటాయి.