దేశంని ఇతర రాష్ట్రాలు మొత్తం బడ్జెట్లో ఏపీ, బీహార్‌కు తప్ప.. తమకేమీ దక్కలేదని గగ్గోలు పెడుతున్నాయి. కానీ ఏపీలోని విపక్షం మాత్రం ఏపీకి జీరో అంటూ కథలు ప్రారంభించారు బడ్జెట్ లో అప్పులు ఇస్తామని చెప్పారని.. చెప్పుకొస్తున్నారు ఎవరి విశ్లేషణ వారిది అనుకోవచ్చు. అయితే మరి ఇక్కడ బీజేపీని వైసీపీ వ్యతిరేకిస్తుందా అంటే… చాన్సే లేదు. ఎదురుగా బీజేపీ అగ్రనేతలు వస్తే కాళ్ల మీద పడిపోతారు. నిన్నటికి నిన్న అనేక సార్లు ప్రయత్నాలు చేసి అమిత్ షాను కలిసిన విజయసాయిరెడ్డి కాళ్లకు దండం పెట్టుకుని వచ్చారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జీరో ఇస్తే… విమర్శించాల్సింది బీజేపీని కదా. ఎదుకంటే ఆ పార్టీనే బడ్జెట్ పెట్టింది. ఆ పార్టీ సంగతి చూస్తామని..ఏపీకి ద్రోహం చేసిందని ఆరోపించాలి కదా. కానీ తెలుగుదేశం పార్టీనే విమర్శిస్తారు. అదే తమకు ఆ సీట్లు వచ్చి ఉంటే… ఏం చేసేవాళ్లమో ట్వీట్లలో కథలు చెప్పుకుంటున్నారు. కానీ వారికి గతంలో టీడీపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. రాజ్యసభలో బలం లేని బీజేపీకి తామే ప్రతీ సారి అండగా నిలిచారు. అయినా ఒక్కటంటే ఒక్క చిన్న ప్రాజెక్టుకూ నిధులు తేలకపోయారు సరి కదా.. కేంద్ర పథకాలకు రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం కబుర్లు ప్రారంభించారు.
నిజంగా ఏపీకి బడ్జెట్లో ఏమీ రాలేదని అనుకుంటే .. బీజేపీపై విరుచుకుపడాలి.. ఆ పార్టీని ఏపీ ద్రోహిగా ప్రకటించి పోరాటం చేయాలి. బిజూ జనతాదళ్ లాగా.. భవిష్యత్ లో ఎప్పుడూ బీజేపీకి మద్దతివ్వబోమని ప్రకటించాలి. ఆ పార్టీ ఏ కూటమిలోనూ లేదు. అయినా బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. అలాగే ఇండీ కూటమి వైపు వెళ్లట్లేదని అలాగని బీజేపీతోనూ లేమని వైసీపీ నిరూపించాలి. లేకపోతే ఆ సంకర రాజకీయం ప్రజల్ని మెప్పించదు సరి కదా.. మరిన్ని విమర్శలకు గురయ్యేలా చేస్తుంది.