మూడు పువ్వులు… ఆరు కాయలుగా సాగే వ్యాపారాల్లో మద్యం బిజినెస్ కూడా ఒకటి. తెల్లారి లేస్తే లెక్చర్లు ఇచ్చే పొలిటికల్ లీడర్స్ నుండి గల్లీ లీడర్ల వరకు, కార్పోరేట్ సంస్థలు ఇలా చాలా మంది మద్యం వ్యాపారాల్లో డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో ఉండే వారే అధికం.
వైన్ షాప్ టెండర్లకు ఎంత పెద్ద ఆసక్తి ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక బార్ షాపుల సంగతి సరేసరి. అయితే, కొత్తగా తెలంగాణలో ఇప్పుడు విచిత్రమైన పంచాయితీ మొదలైంది. బార్ షాప్ ఓనర్స్ అంతా ఇప్పుడు వైన్ షాప్ ఓనర్స్ పై కంప్లైంట్ చేశారు.
వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్స్ కు అనుమతులు ఇచ్చారు. కానీ అందులో ఆహర పదార్థాలు ఉండకూడదు. పర్మిట్ రూమ్స్ 100 చ.మీ మించి ఉండకూదన్న నిబంధనలున్నాయి. ఇవేవి పట్టించుకోకుండా వైన్ షాప్ యజమానులు 2000చ.మీ లలో కూడా పర్మిట్ రూమ్స్ పెట్టుకొని షాపులు నడపటంతో తమకు తీవ్ర నష్టం కలుగుతుందని, వెంటనే వైన్ షాప్స్ పై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖను కోరారు.
తాము లక్షల రూపాయల ఫీజు చెల్లిస్తూ నష్టపోతున్నామని బార్ ఓనర్స్ అంతా ఒక్కటయ్యారు.
ఇంతవరకు బాగానే ఉన్నా… ఎన్నో ఏండ్ల నుండి ఇవి కొనసాగుతున్నా, ఇప్పుడే ఎందుకు బార్ ఓనర్స్ అంతా ఒక్కటై కంప్లైట్ చేశారన్నదే ఆసక్తికరంగా మారింది.