కొద్ది రోజుల కిందట… తెలంగాణ సీఎం కేసీఆర్ మమతా బెనర్జీని కలిసేందుకు కోల్‌కతా వెళ్లారు. కొన్ని ఇంగ్లిష్ చానల్స్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం కేసీఆర్ .. మమతా బెనర్జీతో సమావేశమం అయ్యారని బ్రేకింగ్స్ వేశారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల వారికి ఉండే అవగాహన అదే. అలాంటి చానల్స్ అన్నీ ఇప్పుడు సర్వేలు ప్రకటించేస్తున్నాయి. ఏపీ, తెలంగాణకు తేడా తెలియని చానళ్లు.. ఏపీలో ఎవరు గెలుస్తారో లెక్కలతో ఎలా చెబుతారో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇంగ్లిష్ చానళ్లలో వైసీపీ కోసం టైం స్లాట్ బుక్ చేసిన పీకే..!
జాతీయ మీడియా సంస్థల్లో వైసీపీ క్లీన్ స్వీప్ అని చెబుతున్నాయి. మరోవైపు.. ఓ విశాలమైన గ్రౌండ్లో… సభ పెట్టడానికి జగన్ వణికిపోతున్నారు. సందుల్లో.. గొందుల్లో సభలు పెట్టి… ఓ నాలుగైదు వేల మందిని చేర్చి.. డ్రోన్ కెమెరాలతో షూట్ చేసి.. జన ప్రభంజనం అంటున్నారు. మరో వైపు సర్వేలు. దీని వెనుక చాలా పెద్ద గూడు పుఠాణి ఉంది. సర్వే సంస్థలు… పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ల అవతారం ఎత్తుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి… ఐ ప్యాక్ అనే కంపెనీ పెట్టారు. తానో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ప్రచారం చేసుకున్నారు. సర్వేలు కూడా చేసిస్తారు. తన దగ్గర ఐఐటీల్లో చదవుకున్న వారున్నారని ఆయన చెబుతూ ఉంటారు. సర్వేలు చేస్తున్నట్లు ఆకర్షణీయమైన నివేదకలు తయారు చేయడానికి పెద్ద టీం ఉంటుంది. ఒప్పందం చేసుకున్న పార్టీలకు సంబంధించి ఏదైనా కార్యక్రమం జరిగిదే ట్యాబ్‌లు పట్టుకుని..సీరియస్‌గా దాన్లో ఏదో అప్ లోడ్ చేసుకుంటూ కనిపిస్తారు. కానీ.. వారికి ఇక్కడి లాంగ్వేజ్ తెలియదు. రాజకీయ పరిస్థితులు తెలియదు.
పీకేవన్నీ ఫేక్ సర్వేలే..! నంద్యాల, కాకినాడ ఎన్నికలతో క్లారిటీ..!
నంద్యాల ఎన్నికల్లో … వైసీపీ 25వేల మెజార్టీ తో గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నివేదిక ఇస్తే.. ఫలితం మాత్రం.. రివర్స్‌లో వచ్చింది. కనీసం ఫలితం దరిదాపుల్లో కూడా లేదు. ఇప్పుడు.. అదే సంస్థ సర్వేలు చూపి.. బెదిరించి.. మైండ్ గేమ్ ఆడి…కొంత మంది పారిశ్రామికవేత్తల్ని వైసీపీలో చేర్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రశాంత్ కిషోర్ అండ్ టీంకి.. జాతీయ మీడియాగా పిలువబడే… ఇంగ్లిష్ చానళ్ల యాజమాన్యాలతో సన్నిహిత సంబంధాలుంటాయి. ఆయా చానళ్లకు సర్వేలు ప్రసారం చేసే ప్యాకే్జీలు కూడా.. ఐప్యాక్ మాట్లాడి పెడుతుందనే ప్రచారం ఉంది. కొన్ని కొన్ని సంస్థల స్టింగ్ ఆపరేషన్లలోనూ ఇది బయటపడింది. సర్వేలు రిలీజ్ చేయడం వెనుక చాలా మైండ్ గేమ్ ఉంది. ఈ సర్వేలను చూసి.. ఆయా రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ఆడతాయి. ఇతర పార్టీల నుంచి నేతల్ని లాగుతాయి. ఎన్నికలను ఎదుర్కొనేందుకు .. రాజకీయాలపై ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలకు గాలం వేస్తాయి. అదే సమయంలో.. ప్రజల్లో గెలిచే పార్టీ అన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తాయి.
మైండ్ గేమ్ కోసం సర్వేలు..! ఫలితం మాత్రం తేడా..!
సహజంగా.. తటస్తులు గెలిచే పార్టీకి ఓటు వేసేవాళ్లు కొంత మంది ఉంటారు. వారి ఓట్లను టార్గెట్ చేసుకుని సర్వేలు ప్రకటిస్తూంటారన్న అభిప్రాయం ఉంది. కానీ వరుసగా ఫెయిలతవుతున్న సర్వేలతో.. వాటికే విశ్వసనీయత లేకుండా పోయింది. అయినా.. ప్రతీ ఎన్నికలకు ముందు ఈ సర్వేలతో హడావుడి కామన్ అయిపోయింది. తమకు అనుకూలంగా వస్తే.. ప్రభంజనం అని చెప్పుకోవడం.. వ్యతిరేకంగా వస్తే.. దొంగ సర్వేలనడం.. రొటీన్ అయిపోయింది దేశంలో పది న్యూస్ చానల్స్.. ఇరవై సర్వే సంస్థల పేర్లతో… ఒప్పందాలు చేసుకుని 30 రకాల సర్వేలు ప్రకటిస్తాయి. అందులో ఒకటో, రెండో మాత్రమే.. అసలు ఫలితానికి దగ్గరగా ఉంటాయి. అందులో వారి ప్రతిభ ఏమీ ఉండదు. ఇలా .. ఓ సారి తమ అంచనాలు తప్పయితే.. ఆ సర్వే సంస్థలు లెంపలేసుకుని.. మరోసారి ఆ పని చేయకూడదు. కానీ.. ఇప్పుడు సర్వే సంస్థలకు ఇదో బిజినెస్ అయిపోయింది.