వైసీపీ క్యాడర్‌కు.. ఆ పార్టీ నేతలకు.. టీడీపీ వాళ్లపై బూతులతో విరుచుకుపడటం కంటే.. తమ పార్టీ అధినేత మాట్లాడే బూతులను కవర్ చేసుకోవడానికి .. ఎదురుదాడి చేయడానికి శక్తి మొత్తం కేటాయించాల్సి వస్తుంది. రాజకీయాల్లో అయినా మరో చోట అయిన రెండు రకాల బూతులు ఉంటాయి. ఒకటి వైసీపీ క్యాడర్ మాట్లాడే బూతులు. ఇవి నేరుగా ఉంటాయి. రెండోది జగన్ రెడ్డి మాట్లాడే బూతులు. ఇవి సామాన్యంగా ఎవరికీ అర్థం కావు. కాస్తో ఇస్తిస్కో.. గుండూరు.. లాంటి పదాలతో చెడుగుడు ఆడుకుంటారు.
తాజాగా ఆయన ఇలాంటి మరో బూతును ప్రయోగించారు. పొటాటో అంటే ఉల్లిగడ్డ కదా అని తన విజ్ఞాన్ని కెమెరాల ముందు ప్రదర్శించి దొరికిపోయారు. సాధారణంగా ఇలాంటివి దొరికితే సోషల్ మీడియా పండగ చేసుకుంటుంది. దానికి తగ్గట్లుగానే దెబ్బకు వైరల్ అయిపోయింది. జగన్ మోహన్ రెడ్డి పొటాటో రెడ్డి అనే పేరు పెట్టేసి ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. దీంతో వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. రాయలసీమలో పొటాటోను ఉల్లగడ్డ అంటారని.. అందుకే అలా అడిగారని వాదించారు. కానీ వీడియోలో జగన్ రెడ్డి ఉల్లి గడ్డ అనే అన్నారు. అంతేకాదు.. తాను తప్పు చెప్పానని సారి అని చెప్పి బంగాళదుంప అని కూడా కవర్ చేసుకున్నారు. అంటే పొటాటో అంటే ఉల్లిగడ్డ అని తానే పొరపడ్డానని అంగీకరించారు.
అయినా తమ నేత తెలివితేటలు ఇలా బహిర్గతం అవడం ఏ మాత్రం తట్టుకోలేకపోతున్న వైసీపీ క్యాడర్, సోషల్ మీడియా కార్యకర్తలు… సొంత తెలివితేటలతో డిఫెండ్ చేస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డికి ఉల్లి, పొటాటో తెలియకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కానీ వారి కవరింగ్ మొత్తం అంతకు మించిన కామెడీ అవుతోంది. ఎన్ని సార్లు ఎలా.. మాట్లాడినా కవర్ చేయడానికి తంటాలు పడుతున్నారు. జగన్ రెడ్డి ఏమీ మాట్లాడకపోతే టీడీపీ నేతలపై ఫేక్ పోస్టులు పెట్టుకోవచ్చని కానీ జగన్ రెడ్డి మాట్లాడితే.. మాత్రం ఆయనను డిఫెండ్ చేయడానికి కిందా మీదాపడాలని వారు వాపోతున్నారు.