ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ని గెలుచుకుంది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. అయితే ఇంగ్లాంగ్ ఇంకా ఆ టీ20 హ్యాంగోవర్ నుండి బయటపడలేదేమో.. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ని కూడా టీ20 గా మార్చేసింది. దశాబ్ధకాలం తర్వాత ఒక విదేశీ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళింది. టెస్ట్ సిరిస్ కోసంఇంగ్లాండ్ కి ఆతిధ్యం ఇచ్చింది పాకిస్తాన్. ఈ చారిత్రత్మక మ్యాచ్ లో.. ఇంగ్లాండ్ జట్టు కొత్త చరిత్రే సృష్టించింది.
ఈ రోజు మొదలైన టెస్ట్ సిరిస్ మొదటి రోజు ఆటలో బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి రోజు ఆట 75 ఓవర్లలో ఏకంగా 506 పరుగులు చేసింది. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్. ఇంతకుముందు ఈ రికార్డ్ 494 పరుగులతో ఆస్ట్రేలియా పేరిట వుండేది. అలాగే ఇంగ్లాండ్ జట్టులో నలుగురు ఆటగాళ్ళు( కార్వ్లేయ్, డుకేట్, పొప్, బ్రూక్) సెంచరీలు సాధించారు. తొలి రోజు ఆటలో నాలుగు సెంచరీలు నమోదు కావడం కూడా ఇదే ప్రధమం. ఫస్ట్ డే ఆధ్యంతం.. టీ20 మ్యాచ్ ని గుర్తు చేస్తూ విజ్రుంభిచారు ఇంగ్లీష్ బ్యాటర్లు. మంచి పేస్ బౌలింగ్ బలం వుందనే పేరున్న పాక్ బౌలర్లు ఇంగ్లీష్ బ్యాటర్లు ముందు తేలిపోయారు.