ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బటన్ నొక్కడం అనే కాన్సెప్ట్ బాగా ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన కార్యక్రమంలో పాల్గొన్నా బటన్ నొక్కడం గురించే చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో అయినా ప్రజలతో నిర్వహిస్తున్న బహిరంగ సభ అయినాత అధికారులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశం అయినా సరే.. తన బటన్ నొక్కుడు గొప్పతనం గురించి చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో తన బాధ్యత బటన్ నొక్కడమని.. చెప్పుకున్న వీడియో వైరల్ అయింది.
ఇప్పుడు అధికారులతో సంక్షేమానికి సంబంధం లేని సమావేశం నిర్వహించినా అక్కడా అదే చెప్పుకున్నారు. ఆ మాటలనే హైలెట్ చేస్తూ ప్రెస్ నోట్లు విడుదల చేసుకున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ఇతర వి,యాలను ఆయనపెద్దగా పట్టించుకున్నట్లుగా లేరు. తన ప్రసంగం మొత్తం బటన్ నొక్కడం గురించే సాగింది.
ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చి బటన్ నొక్కి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 1 లక్షా 65 వేల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసిందని సీఎం జగన్ తెలిపారు. దేశంలో ఈ తరహా డీబీటీ విధానం ఏ రాష్ట్రం అమలుచేయడంలేదన్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించడం గురించి చర్చించకుండా.. ఇలా అదేపనిగా ఎక్కడ సూచినా సంక్షేమ పథకాల గురించి చర్చించడం ఎబ్బెట్టుగా ఉందన్న అభిప్రాయం అధికార వర్గాల్లోనూ వినిపిస్తోంది.