అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు తర్వాత వైసీపీ భిన్నమైన మార్గంలోకి వెళ్తోంది. దళిత నేతలతో హైకోర్టు తీర్పులపై కామెంట్లు చేయిస్తోంది. అదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు మాత్రం న్యాయస్థానంపై గౌరవం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం విషయంలో ఏం జరిగినా తానే మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి అమరావతి విషయంలో ప్రెస్ మీట్ పెట్టారు. రూ. లక్ష కోట్ల భారాన్ని ప్రభుత్వం మోయలేదని.. తమదే కానీ ఏ ప్రభుత్వమూ మోయలేదన్నారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తామని.. తమది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదని.. రాష్ట్ం మొత్తాన్ని సమానంగా చూస్తామ్నారు. అమరావతి పీక నొక్కడానికి వైసీపీ మొదట్లో వినిపించిన వాదన ఇది. ఆ తర్వతా స్మశానం.. అని అవినీతి అని.. చాలా చెప్పారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత అదే వాదనకు వచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని స్పష్టమైన డాక్యుమెంట్ ఉన్నా వైసీపీ మాత్రం ఈ వాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది.
అదే సమయంలో దళిత నేతలతో కోర్టు తీర్పుల వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత హైకోర్టుకు అవగాహన లేదన్నారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని చెప్పే వారికి అవగాహన లేదని మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడ ఉండాలి అన్న అంశం రాష్ట్రం పరిధిలోనే ఉంటుందని కేంద్రం చెప్పిందని సుచరిత పేర్కొన్నారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. వైసీపీకి చెందిన మరో దళిత ఎణ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు లేదని చెప్పారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. అసెంబ్లీని న్యాయ వ్యవస్థ శాసించడం దారుణమని… ఇలాంటి నిర్ణయాలు తిరిగి న్యాయ వ్యవస్థనే కాటేస్తాయని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని కోరుముట్ల విమర్శించారు.
వైసీపీలో ఎవరైనా హైకమాండ్ ఎలా స్పందించాలో చెప్పిన తర్వాతే స్పందిస్తారు. ముఖ్యంగా దళిత నేతలు పార్టీ విధానాలపై స్పష్టమైన ఆదేశాలు వస్తేనే మాట్లాడారు. ఈ ప్రకారం దళిత నేతలతో తీర్పులపై వ్యాఖ్యానించి.. తాము మాత్రం గౌరవిస్తామని చెబుతున్నారు. వైసీపీ ఈ డబుల్ గేమ్ ఎంత కాలం ఆడుతుందో కానీ.. న్యాయవ్యవస్థపై నిందలేయడం మాత్రం మానుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.