వైసీపీ రాజకీయ వ్యూహాలన్నీ పూర్తిగా చేతులెత్తేసినట్లుగానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాల్లో ఆశలు వదిలేసినట్లుగా.. రాయలసీమపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అక్కడి ప్రజల్లో సీమ సెంటిమెంట్ ఎంత రెచ్చగొడితే అంత మేర లాభమని అనుకుంటున్నారు. ఐదో తేదీన ఏకంగా రాయలసీమ గర్జన పెడుతున్నారు. ఎందుకీ గర్జనో అధికార పార్టీ చెప్పలేదు., ఎందుకంటే… హైకోర్టు కర్నూలులో పెట్టాలంటే అధికార పార్టీనే చేయాలి. కానీ టీడీపీ పై రెచ్చగొట్టడానికి ఈ సభ ఏర్పాటు చేస్తన్నారు.
రాయలసీమలో వైసీపీకి గరిష్ట స్థాయిలో సీట్లు ఉన్నాయి. మూడు తప్ప మొత్తం వైసీపీవే. ఇంతకు మించి గెలవడానికి వైసీపీకి అవకాశం లేదు. కానీ పాలన నాసిరకంగా ఉండటంతో ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో సగం సీట్లు పోయినా.. అధికారం పోతుందన్న భయంతో అన్నింటినీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే పాలనలో ఏం చేశామో చెప్పుకోలేక… సీమ సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకుంటున్నారు. రెచ్చగొట్టుడు కార్యక్రమాలకు సిద్ధపడుతున్నారు. రాయలసీమలో ఎంత సెంటిమెంట్ రెచ్చగొడితే.. ఉత్తారంధ్ర, కోస్తాల్లో అంత మైనస్ అవుతుందని అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే.. అక్కడ టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకుంటే.. తమకేమీ మిగలవని వారికి అర్థమయిందంటున్నారు.
రాయలసీమలో అయినా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఉన్న సీట్లు నిలబెట్టుకునే ప్రయత్నం కోసం అధికార పార్టీ గా ఉండి.. నైతికంగా దిగజారిపోయి.. ప్రాంతీయ గర్జనలు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రజల మద్దతు ఉందని అనిపించడానికి స్కూల్ బస్సులు.. బలవంతపు జన సమీకరణ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత పెంచుతాయి కానీ… సానుకూలత తీసుకు రావు. కానీ వైసీపీ దింపుడు కళ్లం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.