న్యూడ్ వీడియో విషయంలో ఎంపీ మాధన్‌ను రక్షించడమే కాదు.. బాధితుడిగా చూపించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశం ఎంతకీ సద్దుమణగకపోతూండటం .. విచిత్రమైన రియాక్షన్స్‌తో అందరూ ప్రజల దృష్టిలో చులకన అవుతూండటంతో ప్రభుత్వం మరో విచిత్రమైన వేషం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మాధవ్‌ను బాధితుడిగా చూపించేందుకు సిద్దమవుతున్నట్లుగా కనిపిస్తోంది. చాలారోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన హోంమంత్రి.. ఇక్కడ బాధితడు మాధవేనని..ఆయనే ఫిర్యాదు చేశారని.. ఆయన ఫిర్యాదుపైనే విచారణ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మహిళా బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.
ఎవరూ ఫిర్యాదు చేయకుండా సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎలా విచారణ చేస్తామని ఆమె ప్రశ్నించారు. ఆ వీడియో మార్ఫింగ్ అని మాధవ్ పిర్యాదు చేసినందున ఆయన ఫిర్యాదుపై చర్యలు తీసుకునేందుకు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని హోంమంత్రి చెప్పుకొచ్చారు. మాధవ్ వ్యవహారంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఆయనను సమర్థించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించడం ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
ఎంపీ మాధవ్‌కే కాదు.. ఈ ప్రభుత్వమూ విలువలు వదిలేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో ఈ అంశం సద్దుమణగకపోతే ఆ తర్వాత అది ఫేక్ వీడియో అని చెప్పి పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసే అవకాశం లేకపోలేదన్న అనుమానం టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో ఏదైనా జరగొచ్చంటున్నారు.