ఏ యాప్ అయినా బలవంతంగా ఇన్ స్టాల్ చేసుకోవాలని ఎవరూ చెప్పరు. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా కోవిన్ యాప్ విషయంలో కూడా బలవంతం చేయలేదు. ప్రభుత్వంపై నమ్మకం ఉండి.. ఉపయోగం అనుకుంటేనే ప్రజలు డౌన్ లోడ్ చేసుకుంటారు. కానీ ఏపీలో అమలయ్యేది భారత రాజ్యాంగం కాదు. రాజారెడ్డి రాజ్యాంగం. ప్రభుత్వం యాప్ తెచ్చింది.. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిస్తే ఎవరూ చేసుకోలేదు. దిశాయాప్ తెచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే రెండు, మూడు వేల డౌన్ లోడ్స్ కూడా రాలేదు. ఆ యాప్ తో మ్యాజిక్ చేస్తామని పోలీసులు కొన్ని స్కిట్లు ప్రదర్శించినా వర్కవుట్ కాలేదు.
దాంతో మహిళలకు అవసరం అని ముందుగా మహిళల ఫోన్లలో ఇన్ స్టాల్ చేయించారు. వాలంటర్ల ను ..పోలీసుల్ని ఎక్కడిక్కడ వాడుకున్నారు. అయినా ఎక్కువ డౌన్ లోడ్స్ రాలేదు. ఇప్పుడు మగవాళ్ల మీద కూడా పడ్డారు. బస్టాపుల్లోనే కాదు.. ఎక్కడ ఎవరు కనిపించినా ఫోన్ లాగేసుకుని దిశా యాప్ డౌన్ లోడ్ చేస్తున్నారు. ఇదేమిటని అడిగేవారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ఓటీపీలు కూడా తీసుకుంటున్నారు. దీని వెనుక ఏదో పెద్ద దందా జరుగుతోదంని చాలా మందికి తెలుస్తూనే ఉంది. అదేమిటన్నది మాత్రం క్లారిటీ లేదు. ఫోన్ ను పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకునే కుట్ర జరుగుతోందని.. అంటున్నారు. యాప్ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత లోన్ యాప్స్ మాదిరిగా.. కాంటాక్ట్స్, గ్యాలరీ సహా ఫోన్ లో ఉన్న సమస్త సమాచారానికి యాక్సెస్ అడుగుతోంది దిశాయాప్.
అంత అవసరం ఏమిటన్నది ఇక్కడ కీలకంగామారింది. ఒక్క లోకేషషన్ యాక్సెస్ చేస్తే సరిపోతుంది కదా అని నిపుణుల అభిప్రాయం. ఒక్క డేటా చోరీ మత్రమే కాదని.. అంతకు మించిన వ్యూహం ఏదో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై రేపోమాపో కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. దిశాయాప్ వెనుక ఉన్న కుట్రేమిటో తేలాల్సి ఉంది.