ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ అనే దానిపై నేరస్తులకు భయం లేకుండా పోయింది. వైసీపీ నేత అనే ట్యాగ్ ఉంటే.. మర్డర్లు చేసినా నింపాదిగా ఇంటికి వెళ్లిపోవచ్చన్న ధైర్యం ఉంది. అందుకే అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా కావలిలో ఓ బస్ డ్రైవర్ పై దాడి చేసిన దృశ్యాలు అందర్నీ కలచి వేస్తున్నాయి. ఇదేం ఘోరం అని ప్రశ్నించుకోని వారు లేరు. ఏపీలో ఎందుకీ పరిస్థితి… లా అండ్ ఆర్డర్ ఏమయింది.. ? ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న పోలీసు వ్యవస్థ ఏమయింది ? ఏపీ ప్రజలు ఇదేం ఖర్మ.
కావలిలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై హేయమైన దాడి
బెంగుళూరు నుంచి విజయవాడ వస్తున్న బస్సుకు కావలిలో మద్యం మత్తులో ఉన్న వైసీపీ నేతలు అడ్డం పడ్డారు. బస్ హార్న్ కొట్టినందున… ఆ వైసీపీ నేతలకు కోపం వచ్చింది. తమనే అడ్డం తొలగమంటారా అని అనుచరుల్ని పిలిపించి బస్సును వెంబడించి ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. కిందపడిపోయిన డ్రైవర్ పై వైసీపీ నేత కాలుతో తన్నుతున్న దృశ్యాలు చూసిన తర్వాత.. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో అని భయపడని సామాన్యుడు ఉండరంటే ఆతిశయోక్తి కాదు. ఇదే మొదటి దాడి అయితే ఇంత భయటపడేవాళ్లు కాదేమో… ప్రతీ రోజూ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. పుంగనూరులో మొన్న జరిగింది….. వీడియోలు తీసినవే ఇవి. తీయకుండా ఇంకెన్ని ఘోరాలు జరుగుతున్నాయో.. అంచనా వేయడం కష్టం.
వైసీపీ నేతల ధైర్యం పోలీసుల చేతకాని తనమే…!
పుంగనూరులో చొక్కాలిప్పిస్తే.. ఎస్పీ రెడ్డిగారు మద్యం మత్తులో చేశారని సమర్థించారు. వారిపై కేసులు పెట్టింది లేదు… నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. మాచర్లలో పట్టపగలు ఇద్దరు ప్రజాప్రతినిధులపై హత్యాయత్నం చేస్తేనే స్టేషన్ బెయిల్ ఇచ్చారంటే.. ఇక వారికి ఏ మాత్రం ధైర్యం ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. పైగా వీడియోలు అకతాయిలు వైరల్ చేస్తున్నారంటూ సమర్థింపులు. నిందితుల్ని పట్టుకోకుండా… ఆ వీడియోలు ప్రజల ముందు పెట్టడమే తప్పన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇలంటి పోలీసింగ్ తో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పేదలపై దాడి చేస్తున్నారు.
ప్రజలకు ఎందుకీ ఖర్మ
వైసీపీ నేతలకు కోపం వస్తే కొట్టించుకోవాలి… తిడితే తిట్టించుకోవాలి. నిన్నటి వరకూ చాలామంది టీడీపీ నేతల్నే తిడుతున్నారు.. వారినే కొడుతున్నారని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది పాకిపోయింది. సామాన్యుల దగ్గరకు వెళ్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరిపైనా అరాచకం చేస్తున్నారు. ఏపీ ప్రజలకు ఎందుకీ ఖర్మో.. మరి.