ఓ వైసీపీ నేత బాలీవుడ్ నటిని సైతం వేధించాడా? తన కుమారుడిని ప్రేమించిందని ఆమెను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారా? అంటే అవుననే అవుననే సమాధానం వస్తోంది.
అధికారం కోల్పోయాక వైసీపీ నేతల లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. తాజాగా మరో విస్తుపోయే విషయం సంచలనం రేపుతోంది. వైసీపీ నేత కుమారుడితో బాలీవుడ్ నటి ప్రేమ వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. ఆ లీడర్ కుమారుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నందుకు ఆ నటితోపాటు ఆమె కుటుంబానికి చుక్కలు చూపించారని ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వార్త కలకలం రేపుతోంది.
మొదట్లో తన కుమారుడిని వదిలి వేయాలంటూ కోటి నుంచి ఐదు కోట్ల వరకు ఆఫర్ చేసినా ఆ నటి తలొగ్గలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన, జగన్ ప్రభుత్వంలోని ఓ కీలక నేత సాయంతో నటి, ఆమె ఫ్యామిలీని విజయవాడకు పిలిపించి చిత్ర హింసలకు గురి చేసినట్లుగా తెలుస్తోంది.
ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి నటి ఫ్యామిలీని మొత్తం సబ్ జైలుకు కూడా తరలించారని, ఆ తర్వాత తాను మీ కుమారుడికి దూరంగా ఉంటానని చెప్పడంతో ఆమెకు విముక్తి లభించిందని తాజాగా బయటకు వచ్చిన ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఎవరు ఆ వైసీపీ నేత, బాలీవుడ్ నటి అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇక, వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దీంతో ఆ బాలీవుడ్ నటి సైతం బయటకు వచ్చి ఈ విషయంపై ఫిర్యాదు చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.