జగన్ ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోయిందని వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. మాజీ సీఎంకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తారు. ఆ నిబంధనల ప్రకారం ఆయనకు ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రయాణించడానికి ఇస్తారు. విజయనగరం నుంచి ఓ వాహనాన్ని తెప్పించి ఇచ్చారు. ఆ వాహనంలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరారు. వినుకొండ వెళ్లేందుకు ఆయన చుట్టూ తిరిగి వెళ్లే మార్గాన్ని ఎంచుకున్నారు. పది కిలోమీటర్లు వెళ్లిన తర్వాత తాను బుల్లెట్ ప్రూఫ్ వానహంలో కాకుండా మరో టోయోటా ప్రాడో వాహనంలోకి మారారు.
అలా ఎందుకు మారాలంటే.. వాహనం ఆగిపోయిందని ప్రచారం ప్రారంభించారు. ఆ వాహనంలో ఆయనకు అసౌకర్యంగా ఉందని.. అత్యంత లగ్జరీ వెహికల్ అయిన టోయోటా ప్రాడో తన కాన్వాయ్ లోకి తెప్పించుకుని అందులో కూర్చుని ప్రయాణం ప్రారంభించారు. కారు మారిన దానికి సాకుగా అది ఆగిపోయిందని ప్రచారం ప్రారంభించారు. కానీ అది జగన్ ప్రయాణిస్తున్న వాహనం వెంటే ఆయనతో పాటు వినుకొండకు వెళ్లింది. ఎక్కడా ఆగలేదు. ఇదే విషయాన్ని పోలీసు శాఖ కూడా ప్రకటించింది.
ఎక్కడికక్కడ ఓ ప్రదర్శన కోసం అన్నట్లుగా టూర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయన వెళ్లే ప్రతి గ్రామం దగ్గర యాభై నుంచి వంద మంది దాకా పోగేసే బాధ్యతల్ని స్థానికనేతలకు ఇచ్చారు ఎన్నికల ప్రచారం అయినట్లుగా వైసీపీ ప్రచార సామాగ్రినీ పంపిణీ చేశారు. షో చేసుకుంటూ వెళ్లే సరికి లేట్ అయింది. దీనికే కార్లను ఆపేస్తున్నారని.. కార్లు చెడిపోయాయని ప్రచారం చేసుకుంటూ పోయారు. వీరి వ్యవహారం చూసి.. నిజాలు తెలియని వాళ్లను మోసం చేస్తారేమో కానీ.. ఏం జరిగిందో తెలిసిన వాళ్లు నవ్వుకుంటారని కూడా తెలియదా అని సెటైర్లు వేస్తున్నారు. జగన్ రెడ్డి డ్రామాలు ముందు ముందు ఇంకెన్ని చూడాలోనని సెటైర్లు వేస్తున్నారు.