ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అంటే వైసీపీ నేతలకు ఎంత చులకనభావం ఉందో స్వయంగా మంత్రి అప్పులరాజు చూపించారు. శారదాపీఠంలో రాజశ్యామలయాగం చేయాడనికి వచ్చిన సీఎం జగన్తో పాటు పాల్గొనేందుకు మంత్రి సీదిరి అప్పలాజు కూడా వచ్చారు. అయితే ఆయన పీఠంలోకి ఒక్కరే కాకుండా అనుచరులనూ తీసుకెళ్లాలనుకున్నారు. అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అప్పల్రాజు శివాలెత్తిపోయారు. అమ్మనాబూతులు తిట్టారు. మంత్రి కొడాలి నాని మీడియా ముందు మాట్లాడే బూతుల కన్నా ఎక్కువే మాట్లాడారు. పక్కన వాళ్లు రికార్డు చేస్తున్నారని తెలిసినా తగ్గలేదు.
పైగా అప్పల్రాజ్ తిట్టింది కింది స్థాయి పోలీసుల్ని కాదు.. సీఐ స్థాయి అధికారినే. మంత్రి అప్పల్రాజు ఎంత తిట్టినా సీఐ మాత్రం కంట్రోల్ కోల్పోలేదు. వెళ్తే మంత్రి వెళ్లాలి తప్ప అనుచరుల్ని పంపించేది లేదన్నారు. దీంతో అప్పల్రాజు తాను కూడా అలిగినట్లుగా భావించి వెళ్లిపోయారు. నిజానికి ఉదయం కేవలం అప్పల్రాజును అడ్డుకున్నారని.. ఆయనకు అవమానం జరిగిందని వీడియోను బయటకు వదిలారు. అంతకు ముందు ఏం జరిగిందో చెప్పలేదు. కానీ తర్వాత పోలీసులు అసలు వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో పోలీసుల గౌరవానికి భంగం కలిగించేలా ఉంది .
అయినా మంత్రి వ్యవహారాన్ని బయట పెట్టాడనికి పోలీసులు వీడియోను బయట పెట్టారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారని మీడియాకు లీక్ ఇచ్చారు. కానీ ఏం చేయలేరని .. సైలెంట్ అవ్వాల్సిందేనని… నెల్లూరులో ఎస్పీని ఎమ్మెల్యే తిట్టినా ఏమీ చేయని ఘటనలు చాలా ఉన్నాయని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.