చిన్న యాంకర్లే ఖరీదైన కార్లు కొనుక్కుంటున్నారు..నేను కొనుక్కుంటే తప్పా ? అని వాదిస్తున్నారు కానీ .. బెంజ్ కారుకు రూ. కోటిన్నర ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం రోజా చెప్పడం లేదు. కొద్ది రోజుల కిందట కుమారుడికి పుట్టిన రోజు కారణంగా రూ. కోటిన్నర విలువైన బెంజ్ కారును గిఫ్టుగా కొన్నిచ్చారు. ఆ వీడియోను సోషల్ మీడియాలోనూ వైరల్ చేసుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా… ఆమె మంత్రి అయిన తర్వాతే ఇలా ఖరీదైన కారు కొనుగోలు చేయడం దుమారం రేపుతోంది.
పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ ఆరోపణలను జనసేన నేతలు ఎక్కువగా చేస్తున్నారు. వారిపై రోజా మండిపడుతున్నారు. దీంతోీ విషయం హైలట్ అవుతోంది. తాను జబర్దస్త్‌లో లక్షల రెమ్యూనరేషన్లు తీసుకున్నానని..150 సినిమాల్లో హీరోయిన్గా చేశానని.. చెబుతున్నారు. కానీ ఆమె హీరోయిన్గా చేసింది జమానా కింద.. అప్పట్లో ఆమె నిర్మాతగా మారి.. సంపాదించుకున్నది కాకుండా.. సంపాదించుకోబోయేది కూడా పోగొట్టుకున్నదని చాలా మందికి తెలుసు.
అప్పుల పాలయ్యారని.. చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొన్నారని కూడా తెలుసు. అయితే తాను ఎప్పుడో హీరోయిన్ గా చేశానని ఇప్పుడు జబర్దస్త్ యాంకర్‌గా మానేసిన తర్వాత.. తన లక్షల్లో వస్తున్నాయని చెప్పి బెంజ్ కారు కొన్నానని చెప్పడం ఆమె వాదనలో పస లేదని.. చెబుతూ మరిన్ని ఆరోపణలు రావడానికి కారణం అవుతున్నారు. మొత్తానికి జనసేన నేతలు.. ఈ బెంజ్ విషయాన్ని ఇక్కడితో వదిలేలా లేరు. పెద్ద వివాదమయ్యేలానే ఉంది.