ఏపీకి వచ్చే నిధులకు ఎలా అడ్డంపడాలో రీసెర్చ్ చేసి మరీ వస్తున్నారు వైసీపీ తరపున గెలిచిన నలుగురు ఎంపీలు. లోక్ సభలో మాట్లాడిన మిధున్ రెడ్డి అమరావతికి నిధులు ఇవ్వొద్దని నేరుగానే చెబుతున్నారు. అమరావతి అప్పులు ఇవ్వద్దని తేల్చేశారు. ఏమైనా అంటారని .. తెలివిగా గ్రాంట్ గా ఇవ్వాలని చెప్పుకొచ్చారు. అది లోన్ అని కేంద్రం చెప్పలేదు.. గ్రాంట్ అని కూడా చెప్పలేదు. ఆర్థిక సంస్థల నుంచి ఇప్పిస్తామని చెప్పింది. అంటే బాధ్యత కేంద్రానిది., ముందు వచ్చిన నిధుల్ని ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలి కానీ ఇలా.,. నిధులు ఇవ్వొద్దని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరించింది.
ఏపీకి బడ్జెట్లో మంచి ప్రయోజనాలు కల్పించారని అందరూ అంటూంటే… ఏపీ ప్రతిపక్షం మాత్రం ఏమీ రాలేదని ఏపీలో ప్రచారం చేస్తోది. ఏమీ ఇవ్వొద్దని నేరుగా పార్లమెంట్ లో చెబుతున్నారు. ఇలాంటి ఎంపీలు ఏ రాష్ట్రంలోనూ ఉండరని ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు గుసగుసలాడే పరిస్థితి కనిపిస్తోంది. మిధున్ రెడ్డి …తమ చిత్తూరు జిల్లాలో భూములన్నీ దోచేసి అక్కడమైనా రాజధానికి ప్లాన్ చేశారేమో కానీ… అమరావతిపై మొదటి నుండి అదే కుట్ర, కుతంత్రాతో గడిపేశారు. ఇప్పుడు ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా మారడం లేదు.
Also Read : దటీజ్ బాబు.. అమరావతికి బడ్జెట్లో నిధులు!
ఏపీ రాజధాని లేదా ఏపీ రాష్ట్ర భవిష్యత్ పై ఎప్పుడూ వారికి పట్టింపు లేదు. గనులు, భూములు దోచుకున్నామా.. లిక్కర్ లో లెక్క తేలిందా లేదా అన్నదానిపైనే ఐదేళ్ల పాటు టైం పాస్ చేశారు. ఇప్పుడు ఫుల్ టైం .. ఏపీలో ఏ పనీ జరగకుండా అడ్డు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ తరహా ఎంపీలు.. ఏపీకి ఉండటం.. పెను శాపమే.