పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రతిపక్ష హోదా కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించడంతో .. విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ కార్యదర్శితో పాటు , అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణలో ఏం జరుగుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
జగన్ దాఖలు చేసిన పిటిషన్ లో 1953 ఏపీ యాక్ట్ ని గుర్తు చేస్తూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వంతో విబేధించే ఎక్కువమంది సభ్యులున్నా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది జగన్ పాయింట్. కూటమితో విబేధిస్తోన్న ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీలో వైసీపీకి చెందిన వారే ఉండటంతో తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలనేది జగన్ వాదన.
Also Read : జగన్ దారేదో.. తెలిసేది నేడే!
అసెంబ్లీ వ్యవహారాల్లో అంతిమ నిర్ణయం స్పీకర్ దే.శాసన సభ వ్యవహారాల్లో న్యాయస్థానాలు స్పీకర్ కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవు. ఒకవేళ హైకోర్టు జగన్ పిటిషన్ పై స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేసే విషయంలో స్పీకర్ విచక్షణ మేరకే నిర్ణయం తీసుకుంటారు తప్పితే కోర్టులు ఒత్తిడి చేయలేవు. ఎటు చూసినా బంతి మళ్లీ స్పీకర్ కోర్టులో పడుతుంది..ఇవన్నీ తెలిసి కూడా జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ప్రతిపక్ష హోదాకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఇవ్వగానే ఏదో జరగబోతుంది అన్నట్లుగా వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. త్వరలో హైకోర్టు ఇచ్చే ఆదేశాలు ఎలా ఉంటాయో కానీ , వైసీపీ మాత్రం అప్పుడే తమ నేతకు ప్రతిపక్ష నేత హోదా వచ్చేసిందనే స్థాయిలో ప్రచారం చేసుకుంటుంది. ఇల్లు అలకగానే పండగ కాదు అనేది వైసీపీ తెలుసుకుంటే మంచిదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.