వైసీపీ సోషల్ మీడియలో ఇప్పుడు చాలా మంది ఉన్మాద వారియర్స్ కనిపించడం లేదు. చాలా మంది బ్లాక్ చేసుకుంటే కొంతమంది సుప్పిని, సుద్దపూసల్లా మాట్లాడటం ప్రారంభించారు. చాలా మంది తమ ఇళ్లను ఖాళీ చేసిగుర్తు తెలియని ప్రాంతాలకు వెళ్లిపోయారు. సజ్లల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ కూడా తాను ఓటు నమోదు చేయించుకున్న ఇంట్లో లేరు. ఆయతో పాటు కుటుంబం అంతా హైదరాబాద్ వెళ్లిపోయింది. కానీ హైదరాబాద్ లో కూడా లేరు.
వైసీపీ సోషల్ మీడియాలో కొంత మంది ఉన్మాద వారియర్స్ ప్రత్యేకం, గుర్రంపాటి దేవందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ రెడ్డి లాంటి వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారందరూ వైసీపీ గెలిచిన వెంటనే డీయాక్టివేట్ చేసుకున్నారు. కొంతమంది ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. కొంత మంది ఆజ్ఞాతంలోకి వెళ్లి సుప్పిని, సుద్దసూస పోస్టులు పెడుతున్నారు. గతంలో తాము చాలా మర్యాదగా వ్యవహరించినట్లుగ మాట్లాడుతున్నారు.
చంద్రబాబు ప్రమణస్వీకారం తర్వాత గత ఐదేళ్లలో టీడీపీ మహిళ నేతలతో పాటు అగ్రనేతలపై అసభ్యంగా దాడి చేసిన వారందరి వేట ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలంటున్నాయి. ఎక్కడ ఉన్నా వదిలి పెట్టే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. రేపంటూ లేదన్నట్లుగా చెలరేగిపోయిన వారికి రేపు అనేది ఉంటుదని చూపించేందుకు రెడీ అవుతున్నారు.
సజ్జల భార్గవపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గీతాంజలి మృతి విషయంలోనూ ఆయనపై అనుమానాలున్నాయి. ఈ కోణంలోనూ కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.