రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో విజయవాడ కాస్త విలయవాడగా మారింది. ఊహించని విధంగా వరద పోటేత్తడంతో జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆదివారం ఉదయం ఓసారి వరద ప్రభావిత ప్రాంతాలను చుట్టేసిన చంద్రబాబు… అర్దరాత్రి మళ్లీ బోటులో ప్రయాణించి వరద బాధితుల ఆవేదనను విని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సీఎం మొదలు .. కింది స్థాయి అధికారి వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇచ్చారు. ఉద్యమంలా ఈ సహాయక చర్తలు కొనసాగుతున్నాయి. బాధితులకు ఆహార కొరత లేకుండా రోజూ 1.70లక్షల మందికి ప్రభుత్వం ఆహరం సరఫరా చేస్తోంది.
రెండు రోజులుగా వరదలతో జనం అతలాకుతం అవుతుంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు కూడా వైసీపీ నేతలు సాహసించలేదు. చంద్రబాబు ఆదివారం అర్దరాత్రి బోటు ప్రయాణం చేయడం చూసి.. ఆయనపై ప్రజల్లో మరింత పాజిటివ్ ఆలోచన పెరుగుతోందని వైసీపీ నేతలు విధిలేక ఆలస్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం మొదలు పెట్టినట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వరదలతో విజయవాడ అల్లాడిపోతుంటే సర్కార్ కు సలహాలు, సూచనలు చేసిన వైసీపీ నేతలు కూటమి సర్కార్ పై విమర్శల దాడికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ..వరదలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉంటే ఎలాంటి నష్టం జరగకపోయి పోయేదని సన్నాయి నొక్కులు నొక్కారు. మరో నేత సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ..తుఫాన్ వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూటమి సర్కార్ పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు నిరంతరాయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే కానీ వైసీపీ నేతలు ఇంట్లో నుంచి కదిలేందుకు ఆసక్తి చూపలేదు. తీరా పరిస్థితి కొంత మెరుగు పడుతున్న వేళ మీడియా ముంగిటకు వచ్చి సర్కార్ పై విమర్శల దాడి చేయడంపై .. వైసీపీ నేతలు ఈ బురద రాజకీయం మానరా అంటూ ఆ పార్టీ క్యాడర్ లోనే అసహనం వ్యక్తం అవుతోంది.