చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని టెన్షన్ పడిపోతున్నారు. ఎక్కడికి వెళ్లారో చెప్పరా అంటూ ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. ఇక నీలి మీడియాలో రాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
జగన్ రెడ్డి లగ్జరీ ఫ్లైట్ లో లండన్ వెళ్లాడు. తాను లండన్ దిగానని నిూపించుకునేందుకు స్కిట్స్ ఏర్పాటు చేసుకుని వీడియోలు తీయించుకుని రిలీజ్ చేసుకున్నారు. లేకపోతే ఆయన తిరిగి రారని అందరూ అనుమానిస్తారు. లండన్ కు పోయిన విజయామాల్యా, నిరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటి వాళ్లు రాలేదు. అక్కడ రాజకీయ ఆశ్రయం పొందడానికి అవకాశం ఉంది. అందుకే తాను వస్తానని అనుమానాలు పెట్టుకోవద్దన్నట్లుగా వీడియోలు రిలీజ్ చేశారు. తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు.
అయితే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం చాలా మందికి తెలియదు. అంతకు ముందు లోకేష్ కూడా వెళ్లారు. వారు విదేశీ పర్యటనకు వెళ్లారని తెలిసిన తర్వాత వైసీపీకి ఆగడం లేదు. మొదట అమెరికాకు వెళ్లారనుకున్నారు. తర్వాత ఇటలీ అనుకున్నారు. తర్వాత ఇంకొకటనుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ పర్సన్. ఆయన పర్యటన వివరాలు పూర్తి గోప్యంగా ఉంటాయి. తెలుసుకునే ప్రయత్నం చేయడం కూడా నేరమే. కానీ వైసీపీ నేతలు.. తెలుసుకునేందుకు అనైతిక పనులకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వస్తున్నాయి.
చంద్రబాబు ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్లి కుట్రలు చేస్తున్నారని జోగి రమేష్ వంటి వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ గగ్గోలు వెనుక ఏదో సీక్రెట్ ఉండి ఉంటుందన్న గుసగుసలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.