ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి వరుణ్ తేజ్ అక్కడ రోడ్ షోలలో పాల్గొంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురం ప్రచారంలో భాగం కానున్నారని తెలుస్తోంది. మే 5నుంచి చిరు ప్రచారంలో పాల్గొంటారని, కూటమి తరపున తన గళాన్ని వినిపిస్తారని జనసేన నాయకులు పృద్వీ వెల్లడించారు. ఈ ప్రకటనని ముందు తేలిగ్గా తీసిపారేసినట్లు మాట్లాడిన వైసీపీలో ఇప్పుడు చిరు భయం పట్టుకుంది.
ప్రస్తుతం పిఠాపురంలో జనసేన తప్పితే మరో జెండా జనిపించడం లేదు. అందరి ద్రుష్టి పవన్ కళ్యాణ్ పైనే వుంది. ఈ నియోజకవర్గంలో జనసేనానికి అనేక వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పుడు చిరు కూడా వస్తారనే సంకేతాలు వస్తున్నాయ్. ఈ నేపధ్యంలో వైసీపీ అభ్యర్ధి వైసీపీ అభ్యర్ధి వంగా గీత కొత్త పల్లవి అందుకున్నారు. చిరు ప్రచారానికి వస్తే తనకి ఆనందమేనని, ఆయన నాకు అన్న లాంటివారని, అయన నా గురించి వ్యతిరేకంగా మాట్లాడరని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు గీత.
చిరు ప్రచారానికి వస్తే అది పిఠాపురంకు పరిమితం కాదు. ఆ ప్రభావం రాష్ట్రం అంతటా వుంటుంది. నిజానికి రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తిగా సినిమాలపైనే ద్రుష్టిపెట్టారు చిరు. కానీ వైసిపీ నాయకులు నోటి దురుసుతో ఆయన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వైఖరిని ప్రదర్శిస్తునారు. ఇప్పుడు చిరు నిజంగానే ప్రచారానికి వస్తారేనే ప్రకటన జనసేన సభ్యుల నుంచి రావడంతో వైసీపీ శిబిరంలో భయం పట్టుకుంది.