పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ ఏడు వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచింది.. అధికార యంత్రాంగం అంతా వైసీపీలో చేతిలో ఉంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దొంగఓట్లే కాదు పులివెందులలో రిగ్గింగ్ చేసుకున్న విషయం కూడా కళ్ల ముందే ఉంది. టీడీపీకి వచ్చిన ఓట్లు అనుకుంటే వైసీపీకి కలుపుతారేమో కానీ.. వైసీపీ ఓట్లు టీడీపీకి కలిపే చాన్స్ లేదు. ఆ విషయం వైసీపీ పెద్దలకూ బాగా తెలుసు. అందుకే గెలుపు ప్రకటనను అడ్డుకోలేకపోయారు. భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించినట్లుగా ప్రకటించారు. కానీ డిక్లరేషన్ మాత్రం ఇవ్వలేదు.
గెలిచినట్లుగా ప్రకటించి డిక్లరేషన్ ఎందుకివ్వరు .. అంటే.. వైసీపీలో విచిత్రమైన ప్రచారం జరుగుతోంది. నేరుగా సీఎం జగన్ .. రిటర్నింగ్ ఆఫీసర్ అయిన జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి.. గెలిచిట్లుగా ధృవపత్రం ఇవ్వొద్దని ఆధేశించారట. రేపు ఎన్నిక అయిపోతుంది. ఎల్లుండి నుండి మళ్లీ సీఎం జగన్ ఆదేశాలు పాటించాలి. ఆయన చెప్పినట్లుగా చేయకపోతే… కలెక్టర్ అని చూడకుండా… పెట్టీ కేసులు పెట్టించినా పెట్టిస్తారని ఇప్పటికే అనేక మంది అధికారుల విషయంలో ఇది జరిగింది. అందుకే తన వల్ల కాదని చెప్పి కలెక్టర్ వెళ్లిపోయారు. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదనే విషయం మాత్రం చెప్పలేదు.
నియోజకవర్గం మొత్తం రీ కౌంటింగ్ చేయాలని వైసీపీ ఆఫీసు నుంచి ఈసీకి లేఖ రాశారు. నిజానికి అభ్యర్థే ఈ విజ్ఞప్తి చేస్తే ఆర్వో తిరస్కరించారు. రీ కౌంటింగ్ కు సహేతుక కారణాలు ఉండాలి. ఏకంగా ఏడువేలకుపైగా తేడా ఉన్నప్పుడు రీ కౌంటింగ్ కు అనుమతి ఇచ్చే చాన్స్ ఉండదు. ఈ విషయం ఎన్నికల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ సీఎం జగన్ ఈ ఎమ్మెల్సీలో ఓడిపోకూడదని అనుకుంటున్నారు. కడపలో కూడా పోయిందని.. తన నియోజకవర్గం నుంచి మరో ఎమ్మెల్సీ వస్తున్నారంటే తట్టుకోలేకపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే నేరుగా ఆర్వోకు ఫోన్ చేసేంత స్థాయికి దిగజారిపోయారని సెటైర్లు పడుతున్నాయి.
ఇదంతా పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టమన్నట్లుగా చేసుకునే వ్యవహారాలే తప్ప ఇంకేం కాదు. గెలిచిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వకపోతే అది అధికారుల తప్పిదం అవుతుంది. గెలవకపోయినా వైసీపీ అభ్యర్థికి గెలిచినట్లుగా డిక్లేరేషన్ ఇప్పించుకుంటామంటే.. అంతకు మించిన అమాయకత్వం ఉండదు. ఇప్పుడు అదే జరుగుతోంది. సీఎం జగన్ వ్యవహారాన్ని టీడీపీ ఎంత కావాలంటే అంత రచ్చ చేసుకుంటుంది. కానీ వారికి కూడా తెలుసు… అధికారులు ఇంటికి తెచ్చి ఇస్తారని. ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తెలియనిది…. ఒక్క జగన్‌కే. పరువు పోతుందని ఆ పార్టీ నేతలు కూడా సర్దిచెప్పలేని పరిస్థితి.