ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో అతను. తొలి మూడు సినిమాలూ హిట్టే. దాంతో.. బిజీ హీరో అయిపోయాడు. అయితే ఆ తరవాత… ఒక్కటంటే ఒక్క హిట్టూ లేదు. చేసిన సినిమా ప్రతీదీ… ఫ్లాపై కూర్చుంటోంది. కానీ అదేం అదృష్టమో, తనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీగానే ఉంటారు.
సదరు హీరో ఓ అమ్మాయి ప్రేమలో ఉన్నాడని టాక్. చాలా కాలం నుంచి ఈ ఎఫైర్ నడుస్తోంది. అమ్మాయిది.. వైజాగ్ అని సమాచారం. అయితే… హైదరాబాద్ లో ఈ యువ హీరో మరో కుంపటి పెట్టాడట. ఓ యాంకర్ కమ్ యాక్టర్ తో సైడ్ ట్రాక్ నడుపుతున్నాడని తెలుస్తోంది. ఈ విషయం ఇన్నాళ్లూ రహస్యంగానే దాచినా… వైజాగ్ అమ్మాయికి ఈమధ్యే తెలిసిపోయిందట. దాంతో… వైజాగ్ ప్రేమికురాలు రంగంలోకి దిగింది. ఈ హీరోతో తెగదెంపులు చేసుకోవడమే కాకుండా, సదరు యాంకర్ భామని కూడా చెడుగుడు ఆడేసుకుంటోందట. `మీ ఇద్దరి విషయం మీడియా ముందు చెప్పేస్తా..` అంటూ హెచ్చరిస్తోందట. ఈ వ్యవహారం ఎక్కడ మీడియా ముందుకు వచ్చేస్తుందో అని… హీరోతో పాటు, యాంకర్ భామ కూడా అనుక్షణం భయపడుతూనే గడుపుతున్నారని సమాచారం. మరి ఈ బాంబు పేలేది ఎప్పుడో..?