విజయ్ దేవరకొండ స్ఫూర్తితో చాలామంది తెలంగాణ హీరోలు వెలుగులోకి వచ్చారు. ఆ జాబితాలో చేరే ఓ యంగ్ హీరో ఉన్నాడు. తన కెరీర్ ప్రారంభంలోనే ఒకట్రెండు హిట్లు పడ్డాయి. ఇప్పుడు బిజీయెస్ట్ హీరోగా మారిపోయాడు. అయితే ఆ యంగ్ హీరో ఇప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్నాడట. అందులోనూ ఓ హీరోయిన్‌తో. వీరిద్దరూ గతంలో ఓ సినిమా చేశారు. అది ఫ్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా సమయంలోనే ప్రేమ చిగురించిందని, ఇద్దరూ హైదరాబాద్ లోనే కాపురం కూడా పెట్టేశారని టాక్ నడుస్తోంది. తమిళనాడు నుంచి వచ్చిన ఆ హీరోయిన్.. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. కొన్ని హిట్లు కూడా ఉన్నాయి. గ్లామర్ కంటే, పెర్ఫార్మెన్స్కి పెద్ద పీట వేసిన ఆ కథానాయిక తెలుగులో ఇప్పుడు విరివిగా సినిమాలూ చేస్తోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారా? లేదంటే… ఇలానే కొంతకాలం టైమ్ పాస్ చేస్తారా? అనే చర్చ టాలీవుడ్ లో నడుస్తోందిప్పుడు.