వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనంతర పరిణామాలతో వైఎస్ కుటుంబ వ్యవహారాలు.. వారి చరిత్ర విస్తృతంగా చర్చల్లోకి వస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి మాటి మాటికి తెర ముందుకు వచ్చి ఇదేదో రాజకీయ వివాదం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ ఆయనతో పాటు ఈ కేసు విషయంలో ఎలాగైనా అవినాష్ రెడ్డిని బయట పడేయడానికి కథలు చెబుతున్న వారంతా అర్థం చేసుకోనిది ఏమిటంటే… తమ పరువును తాము బజారున పడేసుకున్నామని.
కారణం ఏదైనా వైఎస్ ఫ్యామిలీకి ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో గతంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ ఫ్యామిలీనే పూర్తిగా తమలో తాము ఆరోపణలు చేసుకుటూ కోర్టులకు ఎక్కుతున్నారు. చనిపోయిన వారిపై ఎవరూ చేయలేనంత హీనమైన ఆరోపణలు చేసుకుటున్నారు. వివేకా కుమార్తెపై అవినాష్ రెడ్డి దారుణ ఆరోపణలు చేశారు. తండ్రినే చంపించిందని ఆయన అంటున్నారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి వివేకానూ వదల్లేదు… నిందితుల కుటుంబసభ్యులతో అక్రమ సంబంధాలు అంటగట్టేశారు. ఆయన అధికారికంగా ఇవి చెబితే… 0 అవినాష్ రెడ్డి గురించి చెప్పుకోలేనన్ని ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రారంభమయ్యాయి.
ఇక్కడ వివేకాను చంపింది.. చంపించింది.. మొత్తం వైఎస్ ఫ్యామిలీలోని వారే. అందులో రాజకీయం ఉన్నా.. అతి కుటుంబ రాజకీయం. ఇతరులకు సంబంధం లేదు. కానీ దీనిపై జరుగుతున్న ప్రచారం.. వైఎస్ కుటుంబసభ్యులు … తాము బయటపడి ఇతురుల్ని ఇరికిచేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఈ కటుంబకథలో అంతర్గతంగా ఉన్న అంశాలు బయటకు వస్తున్నాయి. ప్రజలు ఔరా అనుకునేలా చేస్తున్నాయి. మొత్తంగా… ఇదా వైఎస్ ఫ్యామిలీ అనుకునేలా చేస్తున్నాయి.