జగన్ బెంగళూరు నుంచి రావడానికి కొంత మంది వైసీపీ నేతలపై దాడులు జరగాలి. వారిని పరామర్శించేందుకు రావాలి. ఇప్పుడు అదే జరుగుతోది. జగ్గయ్యపేటలో వైసీపీ నేతలపై వ్యక్తిగత వివాదాలతో జరిగిన దాడుల్ని రాజకీయంగా మార్చేసేందుకు మరోసారి బెంగళూరు నుంచి వస్తున్నారు. వినుకొండ తరహాలో నిందితులు కూడా వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చిన వారే. అయినా జగన్ కు కావాల్సిన ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి బెంగళూరు నుంచి వస్తున్నారు.
రెండు రోజుల పాటు తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన విడిది చేస్తారు. మంగళవారం సాయంత్రం ఆయన నేరుగా బెంగళూరు నుంచి వచ్చి ఆస్పత్రిక వెళ్లి పరామర్శించి బుధవారం,గురువారాల్లో ప్యాలెస్ లో విడిది చేస్తారు. ఎందుకైనా మంచిదని కార్యకర్తలు ఎవరూ రావొద్దని కూడా సమాచారం పంపారు. ఎందుకంటే జగన్ ఎవర్నీ కలవరు. రెండురోజుల పాటు విశాఖ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారట.
Also Read : సీఎం రేంజ్ సెక్యూరిటీ కావాలి – హైకోర్టులో జగన్ పిటిషన్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను జగన్ ఖరారు చేశారు. ఎలాగైనా ఆయనను గెలిపించుకోవాలని.. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ఓటర్లను ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మంది ఆయనతో భేటీకి వస్తారన్నదానిపై…బొత్స పోటీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.