జగన్ రెడ్డి తాను ఎంత పెద్ద తెలివిగలవాడ్నో నిరూపించేకొద్దీ నిరూపించాలనుకుంటన్నారేమో కానీ.. పదేపదే వచ్చి ప్రజల ముందు అభాసుపాలవుతున్నారు. లండన్ వెళ్లేందుకు బట్టలు సర్దుకుని ఫైనల్ గా ఓ సారి చంద్రబాబు మీద కాస్త బురద చల్లేసి పోదామని బెజవాడ వచ్చారు. అక్కడ ఆయన మీడియా కెమెరాల ముందు మాట్లాడిన మాటలతో మరోసారి ట్రోలింగ్ స్టఫ్ ఇచ్చారు.
బుడమేరును ఈ సారి నదిగా చెప్పుకొచ్చారు. బుడమేరు నది కి ఉన్న గేట్లను చంద్రబాబు ఆకస్మికంగా ఎత్తించడం వల్లే వరదలు వచ్చాయన్నారు. ఆయన మాటలు విని అందరూ మోహాలు చూసుకున్నారు. తాము కూడా ఈ ఆజ్ఞానంలో కొట్టుకుపోతున్నామని చాలా మంది ముఖ్య నేతలు రావడం మానేశారు. ఆయన మాత్రం వచ్చి..రకరకాల ప్రతిభా ప్రదర్శనలు చేస్తున్నారు. చంద్రబాబు మే పదమూడు నుంచి సీఎంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆ రోజు పోలింగ్ జరిగింది. అది కూడా గుర్తు లేదు. కౌంటింగ్ రోజు వరకూ జగనే సీఎంగా ఉన్నారు.
ఇలాంటి వాటితో పాటు ఆయన కడుపు మంట మొత్తం బయట పెట్టుకున్నారు. చంద్రబాబు సీఎంగాపనికి రారని చెప్పుకొచ్చారు. ఐదేళ్లు సీఎంగా ఉండి ఇంట్లో నుంచి బయటకు రాని ఆయన కూడా చంద్రబాబును అనేస్తున్నారని పక్కన వాళ్లు అనుకోవాల్సిన పరిస్థితి. అదే సమయంలో అధికారులు బదిలీలపైనా మాట్లాడారు. ఆయన కోసం పని చేసిన వారు .. మీరు చెప్పినట్లే చేశాం.. మా సంగతేమిటని ఒత్తిడి చేస్తున్నారేమో కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కూడా కనిపిస్తోంది.
జగన్ ఇలాంటి ప్రకటనలతో తన హార్డ్ కోర్ ఓటు బ్యాంక్ ఎంటర్ టెయిన్ చేస్తున్నారని అనుకుంటున్నారేమో కానీ.. మిగతా ఓటర్లలో అసహ్యం అంతకంతకూ పెరుగుతోందని గుర్తించలేకపోతున్నారు.