వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లలేదు. విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన ప్రత్యేక లగ్జరీ విమానం లండన్ వెళ్లింది కానీ.. అక్కడ ఎయిర్ పోర్టులో దిగడానికి అనుమతి లభించలేదు. మూడు సార్లు అనుమతి కోసం ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో నెదర్లాండ్స్ లోని అమ్స్టర్డామ్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. అక్కడ సేఫ్ ల్యాండింగ్ జరిగింది. లండన్ లో ఎందుకు దిగేందుకు అనుమతించలేదన్నది సస్పెన్స్ గా మారింది.
జగన్ లండన్ బయలుదేరిన కాసేపటికే రాజమండ్రి నుంచి మరో ప్రత్యేక విమానం ముంబై మీదుగా లండన్ వెళ్లింది. ఇందులో ఎవరు ప్రయాణించారన్నది తెలియదు. కానీ ఎయిర్ ట్రాఫిక్ ట్రాకింగ్ సైట్లు మాత్రం… ఆ ఫ్లైట్ లండన్ లో ల్యాండ్ అయిందని తేల్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి విమానానికి మాత్రమే ప్రత్యేకంగా ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు. దానికి దానికి కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.
లండన్ లో ఉన్న తన కుమార్తెలను చూసేందుకు..వారితో గడిపేందుకు విదేశీ పర్యటనకు అనుమతి కావాలని జగన్ అడిగారు. కోర్టు అనుమతి ఇచ్చింది. నిజానికి ఇద్దరు కూతుళ్లు ఇండియాకు వచ్చారు. ఓట్లు కూడా వేశారు. అందరితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. లండన్ కు మాత్రమే పర్మిషన్ తీసుకుని ఇతర దేశాలకు వెళ్లారు. గతంలో కూడా దావోస్ కు వెళ్లే ముందు లండన్ వెళ్లి అక్కడ్నుంచి కుమార్తెల్ని తీసుకుని దావోస్ కు వెళ్లారు.