అయ్యవారు చూడటానికి జ్ఞానిలా కనిపిస్తారు కానీ నోరు తెరిస్తేనే ఎంత అజ్ఞానినో తెలుస్తుందని అందుకే.. వీలైనంత వరకూ నోరు తెరవకుండా, బయటకు రాకుండా చూసుకుంటేనే గౌరవం మిగులుకుతుందని కొంత మంది ఘనుల గురించి చెప్పుకుంటూ ఉంటారు . వాళ్లు చేసే పనులు అలాగే ఉంటాయి మరి. వైఎస్ జగన్ కూడా వైసీపీకి అలాగే తయారయ్యారు. ఆయన బయటకు రాకపోవడం… ఎవరితోనూ మాట్లాడకపోవడమే మంచిదని ఆయన బొమ్మ పెట్టుకుని ఇతర నేతలు రాజకీయం చేస్తే చాలని అనునుకుంటున్నారు.
ఎసెన్షియా కంపెనీ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చిన జగన్ రెడ్డి వ్యవహారశైలి, హావభావాలు, విచిత్రమైన ప్రకటనలు చూసి వైసీపీ నేతలు కూడా తలలు పట్టుకున్నారు. తనకు మాత్రమే సాధ్యమైన ఓ బ్రాండెడ్ నవ్వును ఆయన బాధితుల్ని చూసినప్పుడు ఎందుకు నవ్వుతారో అక్కడున్న వారికి అర్థం కాదు. కనీసం అలాంటి చోటికి వచ్చిప్పుడన్నా గంభీరంగా ుండేప్రయత్నం చేయాలని ఆ దిశగా సలహాలివ్వాలని వారి పార్టీ నేతలు ఎందుకు అనుకోరో తెలియదు. అప్పటికే పరిహారం పంపిణీ అయిపోతే ఆ విషయం తెలియదో.. తెలిసి కూడా అజ్ఞాన ప్రదర్శన చేసుకున్నారో కానీ.,.. పరిహారం ఇవ్వకపోతే ధర్నా చేస్తానని చెప్పుకొచ్చారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇప్పటికీ బాధితులు అనేక మందికి పరిహారం అందలేదు. వారి కోసం ధర్నా చేస్తానని చెప్పలేదు.
జగన్ రెడ్డి వ్యవహారశైలి… ఆయన మాట తీరు ప్రజలపై ఏ మాత్రం ఆపేక్ష ఉన్నట్లుగా కాకుండా.. తనకు అధికారం కావాలన్నట్లుగా ఉంటుంది ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానని ఆయన బాధితులకు ఏ మాత్రం సిగ్గుపడకుడా చెప్పుకొచ్చారు. జగన్ సీఎంగా ఒక్క సారిగా బాధ్యతలు చేపట్టక ముందు ఇలాంటివి చెబితే జనం నిజమని అనుకువేవారు. కానీ ఐదేళ్ల పాటు ఆయన నిర్వాకాలు చూసిన తర్వాత కూడా ఇాలాంటి కబుర్లు చెబితే ఎవరు నమ్ముతారు ?. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. వ్యవస్థ విధ్వంసం కారణంగానే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని జనాలకు తెలియదా ?
ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ వీలైనంత వరకు ప్రజల్లోకి వెళ్లకపోవడం… మీడియాతో మాట్లాడకపోవడమే వైసీపీకి మంచిదని.. భావిస్తున్నారు ఆయన మీడియాతో మాట్లాడితే… ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పరు. తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్తారు. మీడియా ప్రశ్నలకు సమాధానాలివ్వకపోతే ప్రజల్లో ఎంత నెగెటివ్ టాక్ వస్తుందో వైసీపీ నేతలకూ తెలుసు. కానీ వారు జగన్ ను ఆపలేకపోతున్నారు. ఆయన ఎంత త్వరగా లండన్ వెళ్లిపోతే అంత మంచిదని వైసీపీ నేతలు కూడా గొణుక్కుంటున్నారు.