వైసీపీ అధినేత జగన్ రెడ్డికి ఏడాది కాలానికి ఇచ్చిన పాస్ పోర్టు సరిపోలేదు.. పర్యటన వాయిదా వేసుకుని మరీ ఐదేళ్ల కాలానికి పాస్ పోర్టు కావాలని హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు పర్మిషన్ ఇచ్చింది ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు. ఆ రోజు లోపల ఇండియాకు వచ్చి పాస్ పోర్టు కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆ పాస్ పోర్టు పరిమితి ఎంత ఉంటే జగన్ కు ఎందుకు ?. మరో సారి విదేశీ పర్యటనకు వెళ్లాలంటే.. పాస్ పోర్ట్ వ్యాలిడేషన్ లేకపోతే మరోసారి చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడే ఐదేళ్లకు కావాలని ఎందుకు పట్టుబడుతున్నారు ?
ఇక్కడే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. జగన్ రెడ్డి లండన్ పోయి మళ్లీ వస్తాడా రాడా అన్న చర్చలు సహజంగానే వస్తున్నాయి. అయితే వాటిని రాజకీయ ప్రేరేపిత చర్చలేనని జగన్ రెడ్డి రాకుండా ఎక్కడకు పోతారని ఎక్కువ మంది అనుకుంటున్నారు.కానీ ఇప్పుడు జగన్ రెడ్డి పాస్ పోర్టు కోసం చేస్తున్న ప్రయత్నాలు చేస్తూంటే..ఆయనకు వచ్చే ఐదేళ్ల కాలంలో రాకుండా ఉండేలా మంచి ప్రణాళికతోనే వెళ్తున్నాడన్న అనుమానాలు బలపడుతున్నాయి.
లండన్ లో ఉండగా పాస్ పోర్టు గడువు తీరిపోతే.. తిరిగి రావాలంటే చాలాకష్టం. పైగా ఆయన కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా లండన్ లో ఉంటారు. ఏ కారణాలు చెప్పినా ఒప్పుకోరు. అందుకే.. వాలిడ్ లో ఉన్న పాస్ పోర్టు దగ్గర ఉంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం పై సీబీఐ దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.