ప్రతిపక్ష నేత హోదా కూడా లేని జగన్ ఆ హోదా కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తనకు సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీ కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఫలితాలు ప్రకటించే ముందు రోజున తనకు 900 మందితో సెక్యూరిటీ ఉందని ఇప్పుడు తనకు అదే సెక్యూరిటీని పునరుద్ధరించాలని ఆయన పిటిషన్లో కోరారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి ఆయన కుటుంబానికి .. విదేశాల్లో కూడా భద్రత ఇప్పించేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విభాగంతోనే తనకు సెక్యూరిటీ కావాలని ఆయన వాదిస్తున్నట్లుగా ఉంది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎవరూ చూపించనంత దర్పం చూపించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి.. ట్రాఫిక్ గంటల తరబడి ఆపేయడం వరకూ అన్నీ అరాచకాలు ఉండేవి. రెండు కిలోమీటర్ల వరకూ ఆయన దగ్గరకు ఎవరూ వెళ్లేవారు కాదు. స్కిట్స్ వేసినప్పుడు అనుమతించిన వారు మాత్రమే దగ్గరగా వెళ్లేవారు.
Also Read : జగన్పై వైసీపీ యువనేతల తిరుగుబాటు ?
మాజీ ముఖ్యమంత్రి కాబట్టి జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ఆయితే… తనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి భద్రత కల్పించాలని ఆయన అంటున్నారు. జగన్ కనీసం ప్రతిపక్ష నేత కాకపోయినా ఆయన మాజీ సీఎం కాబట్టి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ఇది కూడా చాలని తనకు సీఎం రేంజ్ సెక్యూరిటీ కావాలని కోర్టులో పిటిషన్ వేయడంతో ఆయన మానసిక స్థితిపై మరోసారి నిపుణులు చర్చించే పరిస్థితి ఏర్పడింది.