వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే వ్యక్తి హత్య జరిగిన తర్వాత రోజు వచ్చారు..అదే రోజు ఢిల్లీ ధర్నా ప్రకటించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారో లేదో తెలియదన్నట్లుగా హాజరై మాయమయ్యారు. ఢిల్లీలో ధర్నా చేసి.. మళ్లీ విజయవాడ వచ్చి.. తాడేపల్లిలో ఉదయం ప్రెస్ మీట్ పెట్టి సాయంత్రానికి బెంగళూరు చేరుకున్నారు.
జగన్ అమరావతిలో ఉండటానికి అసలు ఆసక్తి చూపించడం లేదు. గతంలో చంద్రబాబును అరెస్టు చేసినట్లు అర్థరాత్రి పూట పోలీసులు వచ్చి ఎత్తేస్తారని భయమో.. లేకపోతే వేగం పుంజుకుంటున్న అమరావతి పనులను చూస్తూ ఉండలేకనో కానీ.. అత్యవసరం అయితే తప్ప.. రావడం లేదు. పనులు పూర్తయిన తర్వాత వెళ్లిపోతున్నారు. నిజానికి ఆయనకు హైదరాబాద్ లోనూ ఇష్టపడి కట్టించుకున్న ప్యాలెస్ ఉంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచే రాజకీయాలు చేశారు. కానీ ఈ సారి హైదరాబాద్ అనే ఆలోచనకే రావడం లేదు. ఆయన దారి బెంగళూరు వైపే ఉంటోంది.
Also Read : రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయనే లేదే… జగన్ కు లోకేష్ కౌంటర్
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఉప సీఎం డీకే శివకుమార్ కుటుబంంతో సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా తనకు అక్కడ సేఫ్ గా ఉంటుందని జగన్ అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన దారిలోనే చాలా మంది వైసీపీ నేతలు ఏపీలో కనిపించడం లేదు. నియోజకవర్గాల్లో ఉండటం లేదు. దీంతో వైసీపీ క్యాడర్ కు ధైర్యం చెప్పేవారు లేకుండా పోయారు.