ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలకు పెద్ద ఎత్తున ఇచ్చి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నాయని ఆరోపించాయి. విపక్షాలతో చేతులు కలిపి రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ఆందోళనలు చేయండి కవరేజీ ఇస్తామని మాట్లాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఆశావర్కర్ల ఆందోళనలు.. నిరుద్యోగుల ధర్నాలు.. టీచర్ల నిరసనలు అన్నీ కవరేజీ ఇవ్వడం తప్పని జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు.
ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరని … చంద్రబాబు సీఎంకాలేదని బాధపడేవాళ్లే ఆందోళనలు కోరుకుంటారని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళనలు కోరుకుంటున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులు.. వారి గుర్తింపు సంఘాలు ఎక్కువగా ఆందోళనలు చేపడుతూడంటంతో ఎర్రజెండా వెనుక పచ్చజెండా ఉందని ఆరోపించారు. కేవలం ప్రభుత్వం పైకి రెచ్చగొట్టాలని టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల భవిష్యత్ ఏమిటని జగన్ ప్రశ్నించారు .
మొత్తంగా సమస్యలను పరిష్కరించాలని రోడ్డెక్కుతున్న వారి గురించి ప్రభుత్వం పట్టించుకోకపోగా … మీడియా వారి పోరాటానికి కవరేజీ ఇస్తూంటే సీఎం జగన్ అంగీకరించలేకపోతున్నారు. చలో విజయవాడకు అప్పటికీ ప్రో వైసీపీ మీడియా కవరేజీ ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కాస్త దిగి వచ్చారు.మీడియా కవరేజీ ఇవ్వకపోతే ఉద్యోగులకు ఆ న్యాయం కూడా జరిగే ది కాదు. ఇక ముందు ఉద్యోగులకు అలాంటి మద్దతు మీడియా వైపు నుంచి దక్కకుండా సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.