బాలినేని, మాగుంట శ్రీనివాసరెడ్డిలకు సీఎం జగన్ శీలపరీక్ష పెట్టారు. తమ నిజాయితీని నిరూపించుకోవాలని ఆదేశించారు. అంటే వారు టీడీపీతో కానీ ఇతర పార్టీలతో కానీ టచ్ లో లేరని నిరూపించుకోవాలన్నమాట. ఈ మేరకు .. విజయసాయిరెడ్డిని పిలిచి.. ఈ పరీక్ష విధి విధనాలను చెప్పి వారికి చేరవేయమన్నారు. విజయసాయిరెడ్డి జగన్ చెప్పినట్లుగా.. వారిద్దరికీ జగన్ రెడ్డి పెట్టిన పరీక్ష గురించి చెప్పారు.
ఇంతకీ జగన్ రెడ్డి వారికి పెట్టిన శీలపరీక్ష ఏమిటంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను బూతులు తిట్టడం. ఎంత ఎక్కువగా తిడితే అన్ని ఎక్కువ మార్కులన్నమాట. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎప్పుడూ ఈ దూషణల రాజకీయం చేయలేదు. బూతులు తిట్టరు. కానీ ఆయనకు టిక్కెట్ కావాలంటే… ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రోజూ ఓ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి… చంద్రబాబు, పవన్ లను.. భయంకరంగా తిట్టాలని సందేశం ఇచ్చారు. ఈ తిట్టడంలో విఫలమైతే శీలపరీక్షలో ఫెయిలయినట్లే. టిక్కెట్ ఇవ్వరు. ఈ సారి తన కుమారుడు పోటీ చేస్తారని ఆయనకు చాన్సివ్వాలని మాగుంట అడుగుతున్నారు.
బాలినేనిని కూడా ఇదే టాస్క్ పెట్టారు. అయితే బాలినేని పేరు.. జనసేనతో ఎక్కువగా వినిపిస్తూండటంతో… పవన్ ను వ్యక్తిగతంగా బూతులు తిట్టాలని ఆయనకు కాస్త టాస్క్ మార్చారని చెబుతున్నారు. కానీ బాలినేని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తన పుట్టిన రోజును బలప్రదర్శనగా చేసుకున్న ఆయన.. జగన్ రెడ్డి పుట్టిన రోజు నాడు కేక్ కట్టింగ్ కు కూడా రాలేదు. మెల్లగా వీరిని వదిలించుకుందామనకుుంటున్న జగన్ రెడ్డి ఇలా బూతుల టాస్క్ పెట్టి తప్పించుకుంటున్నారన్న అనుమానం వైసీపీలో వస్తోంది. వారిద్దరూ ప్రెస్మీట్లు పెడతారో లేదో వేచి చూడాల్సి ఉంది.