జగన్ రెడ్డి రాజకీయం ఎంత సిల్లీగా మారిపోయిందంచే చివరికి ఆయన ప్రతిపక్ష నేత హోదా కోసం.. చిన్న పిల్లలు ప్లే చేసే చీప్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే.. మైక్ ఇవ్వాల్సి వస్తుందట.. అలా ఇస్తే ఆయన ప్రశ్నిస్తారట..అందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదట. ఈ నేరేషన్ జగన్ రెడ్డి స్వయంగా చెప్పలేదు. ట్వీట్ చేశారు. బహుశా అన్ని మంత్రిత్వ శాఖలు నిర్వహించి.. ఇప్పుడు గోళ్లు గిల్లుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి రాత్రంతా ఆలోచించి ఈ ఐడియా కనిపెట్టి రాసినట్లుగా ఉన్నారు.
Also Read : జగన్ తో ఆర్ఆర్ఆర్ సంభాషణ..ప్రేమా.. ర్యాగింగా?
151 మంది సభ్యులతో అసెంబ్లీకి వస్తూనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు సభకు వస్తారని భయపడి రాత్రికి రాత్రి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయించిన రికార్డు జగన్ ది. ఇప్పుడు ఆయన చంద్రబాబుకు భయం అంటున్నారు. ఇదొక్కే కాదు.. చంద్రబాబు ఏం చేస్తున్నా భయంతోనే చేస్తున్నరని చెప్పుకొస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని అడ్డగోలుగా దోచుకుని పాతాళానికి పడేసి పోయింది కాకపూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం లేదని .. దానికీ భయమే కారణమని అంటున్నారు. జగన్ రెడ్డి లాజిక్కులు చూస్తే.. ఎవరికైనా మతి పోవడం ఖాయమే.
భయంతోనే ఆయన అసెంబ్లీ నుంచి ఢిల్లీ వెళ్లిపోయి ధర్నాచేస్తున్నారేమో కానీ.. తన ట్వీట్లో మాత్రం.. చంద్రబాబుకే భయం అని చెప్పుకొచ్చారు. యాభై రోజులకే ప్రభుత్వం విఫలమయిందంటూ.. రాష్ట్రపతి పాలన కావాలంటూ ఢిల్లీలో ధర్నాచేయబోతున్న ఆయనను చూసి అందరూ నవ్వుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన స్టేట్ మెంట్లు కూడా అలాగే ఉన్నాయి. అందుకే.. అర్జంట్ గా సొంత రాజకీయాలు అయినా చేయాలి.. లేకపోతే సజ్జలను అయినా మార్చుకోవాలని శ్రేయోభిలాషులు సలహాలిస్తున్నారు.