ఎవరైనా విషాదంలో మునిగిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి ఊరేగింపుగా వెళ్తారా ?. కేరింతలు.. జయజయధ్వానాలు చేయించుకుంటూ బలప్రదర్శన చేసుకుంటూ వెళ్తారా? . చనిపోయిన వ్యక్తి కుటుంబం బాధల్లో ఉంటే రాజకీయంగా బలప్రదర్శనకు.. శవ రాజకీయానికి వాడుకంటారా ?. అసలు అలాంటి ఆలోచన కూడా ఎవరికీ రాదు. కానీ అది జగన్ కు పెటేంట్ స్టైల్ ఓదార్పు. వైఎస్ చనిపోయినప్పుడు అదే చేశారు. ఇప్పుడు వినుకొండలో రషీద్ అనే వ్యక్తి చనిపోయినా అదే చేశారు.
ఉదయం ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి అదే పని. నేరుగా వినుకొండ వెళ్లకుండా.. చిలుకలూరిపేట..నర్సరావుపేట అంటూ చుట్టూ తిరిగి.. ప్రతి పాయింట్ లోనూ నేతలతో జన సమీకరణ చేయించుకుని ఎన్నికల సమయంలోలా .. అభివాదాలు చేసుకుంటూ పోయారు. ఆయన మొహంలో చిరునవ్వు ఎక్కడా తగ్గలేదు. ఆయన తీరు చూసి హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నట్లుగా లేదని శవ రాజకీయం చేయడానికి అవసరమైన సరంజామా దొరికినట్లు ఆనందంగా ఉందన్నట్లుగా ఉందని ఎవరికైనా అనిపిస్తుంది.
అతి స్లోగా వెళ్లి సాయంత్రం ఐదు గంటల సమయంలో వినుకొండ చేరుకున్నారు. దానికీ ఆయన పోలీసుల్నే నిందించారు. వాహనం మంచిది ఇవ్వలేదని.. కాన్వాయ్ ను అడ్డుకున్నారని రకరకాల ఆరోపణలు చేశారు. డిసెంబర్లో తాను ప్రారంభించాలనుకుంటున్న ఓదార్పు యాత్రకు శాంపిల్ గా… ఈ యాత్రను టెస్ట్ రన్ చేసినట్లుగా ఉందన్న సెటైర్లు వైసీపీలోనే వినిపించారు.