అభ్యర్థుల విషయంలో జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీపై పైచేయి సాధించారు. చంద్రబాబు రోజువారీగా.. లోక్‌సభ అభ్యర్థుల సమీక్షలు పెట్టినా.. ఇప్పటికి… ఇంకా నలభై నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కానీ..జగన్మోహన్ రెడ్డి.. అలాంటి కసరత్తేమీ పెట్టుకోకుండా.. సర్వేలు, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలం.. ఇతర అంశాల ఆధారంగా.. అభ్యర్థులను ప్రకటించేశారు. ఎక్కడా మొహమాటలకు అవకాశం ఇవ్వలేదు. తాను ఇవ్వాలనుకుంటే ఇచ్చారు.. లేకపోతే లేదు. ఎవర్నీ బుజ్జగించేందుకు ప్రయత్నించలేదు. అంతకు మించి చర్చలకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ విషయంలో అచ్చంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పద్దతిని..జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యారు.
1999లో రెండో సారి… గెలిచే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అచ్చంగా ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో.. టిక్కెట్ల ఎంపిక ప్రక్రియ అంటే.. చాలా పెద్ద కసరత్తు ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీలు… పరిశీలకులు.. అని చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ..వైఎస్ మాత్రం.. హైకమాండ్‌కు భరోసా ఇచ్చారు. వారి నమ్మకాన్ని చూరగొన్నారు. ఎన్నికల తేదీల ప్రకటనకు సమయం దగ్గర పడక ముందే.. మొత్తం కసరత్తు పూర్తి చేశారు. ఢిల్లీ వెళ్లి అభ్యర్థుల జాబితాను.. హైకమాండ్‌కు అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం… 294 స్థానాల్లో 292 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దాంతో అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్ని ఒత్తిళ్లు హైకమాండ్‌పై వచ్చిన ఒకటి, రెండు చోట్ల మాత్రమే మార్చారు. దాంతో..వైఎస్ తన పట్టు నిరూపించుకున్నారు. అదే ఆయన విజయానికి కూడా కారణం అయిందన్న అంచనాలున్నాయి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్దతి ఫాలో అయ్యారు. నామినేషన్ల స్వీకరణకు ఒక్క రోజు ముందుగా… అభ్యర్థులను ప్రకటించేశారు. ఒక్క స్థానాన్ని కూడా పెండింగ్ లో ఉంచలేదు. ముహుర్తం ప్రకారం.. ముందు రోజులు… తొమ్మిది మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించినా అది సెంటిమెంట్ కోసమే. మొత్తంగా అయితే ఒకేసారి ప్రకటించారు. దీంతో.. అభ్యర్థుల కసరత్తు కోసం అంటూ.. సమయం వెచ్చించాల్సిన అవసరం.. అసంతృప్తికి గురయిన నేతలను బుజ్జగించాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. ఎంత కసరత్తు చేసినా… అసంతృప్తులు ఉంటూనే ఉంటారు కాబట్టి… ఆ తర్వాత వారిని ఎలాగోలా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత టిక్కెట్ల కసరత్తు ఇంతా జరుగుతోంది. దీంతో.. ఓ రకంగా… టిక్కెట్ల ప్రకటనలో చంద్రబాబుపై జగన్ పై చేయి సాధించారు.