వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై.. నేరుగా.. చంద్రబాబునాయుడు, లోకేష్, ఆదినారాయణరెడ్డిలపై ఆరోపణలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆయన ఇతర బాబాయిలు… షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయం కోసం కొంత మంది ఇలాంటి ఆరోపణలు చేస్తూంటారని… జగన్‌పై పరోక్షంగా.. మరో బాబాయ్ వైఎస్ ప్రతాప్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వివేకా హత్యపై ఎలాంటి అనుమానాల్లేవని, సీబీఐ విచారణ కోరడం రాజకీయంగా చేసిన వ్యాఖ్య కావచ్చని ఆయన నేరుగానే ప్రకటన చేశారు. రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నారు. కుటుంబంలోని గొడవలపై.. పోలీసులు తమకు దొరికిన ఆధారాల ఆధారంగా… వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరులందర్నీ పిలిచి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మైనింగ్ ఆర్దిక లావాదేవీల విషయంలో ప్రతాప్ రెడ్డి ఇంటి ముందే గతంలో వివేకా ధర్నా చేశారు.
వైఎస్ వివేకా హత్యలో .. అసలు ఏం జరిగిందో.. కుటుంబసభ్యులందరికీ స్పష్టంగా తెలుసన్న అభిప్రాయం… పోలీసుల్లో ఉంది. వారి ద్వారానే విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో… కాల్ డేటా, వివాదాలు, కిరాయి హంతకులు చెప్పిన సమారాన్ని బట్టి ఎప్పటికిప్పుడు.. కొంత మందిని పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఒకదానికి ఒకటి లింక్‌గా ఇప్పటికే మిస్టరీ వీడిపోయిందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. పోలీసులు ఏ క్షణమైనా పూర్తి డీటైల్స్ ప్రకటించనున్నారు. ఈ తరుణంలో.. వైఎస్ వివేకా సోదరులు… రాజకీయంగా ఎలాంటి ఆరోపణలు చేయడానికి సిద్ధపడటం లేదు. ఒక్క జగన్ మాత్రమే టీడీపీపై విమర్సలు చేసి.. రాజకీయంగా దీన్నో ప్రచారాస్త్రం చేసుకుంటున్నారన్న అసంతృప్తి.. వైఎస్ కుటుంబసభ్యుల్లో ఏర్పడింది.
వైఎస్ వివేకా హత్య కేసులో… మొదటి నుంచి ఏం జరిగిందన్ నదానిపై… ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. హత్యను గుండెపోటుగా ప్రచారం చేయడం దగ్గర్నుంచి అనేక అంశాల్లో ప్రజల్లో సందేహాలున్నాయి. అవేవీ కూడా.. రాజకీయ పరమైనవి కావు. వాటిపై క్లారిటీ ఇవ్వకుండా.. జగన్మోహన్ రెడ్డి.. టీడీపీపై ఆరోపణలు చేస్తూండటంతో.. విషయం మరింత పెద్దదైపోయింది. దీంతో.. సాక్ష్యాలు తుడిచేయడం….అనే అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇది వైఎస్ కుటుంబసభ్యులపై రోజుకో రకం ప్రచారం జరుగుతోంది. దీనికంతటికి కారణం… జగనేనని… అసంతృప్తి పెరిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.