ఏపీలో తీవ్ర దుమారం రేపిన బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వాని అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందిస్తూ.. జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమెను కట్టడి చేసేందుకు సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు.
కాదంబరీ జెత్వాని ఓ మహిళా అని కూడా చూడకుండా వేధింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నో కలలతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎదగాలని భావించిన జెత్వానిని మానసికంగా వేధించారు.. ఆమె కుటుంబాన్ని టార్చర్ పెట్టారు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన జెత్వానిని ముంబై నుంచి ఏపీకి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా? ఎంతటి దుర్మార్గం అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు వేధించినట్లు జెత్వాని చెబుతోంది.. జగన్ ఆదేశాలు లేకుండానే , ఆయనకు తెలియకుండానే ఐపీఎస్ అధికారులు ఆమెను వేధింపులకు గురి చేశారా? అని జగన్ రెడ్డిని ప్రశ్నించారు షర్మిల.
ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్.. జెత్వానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు.. ఈ వ్యవహారంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన షర్మిల..జెత్వానికి తాను అండగా ఉంటూ పోరాటం చేస్తానన్నారు.
అలాగే, గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై కూడా స్పందించారు షర్మిల. కాలేజ్ లో 300 కెమెరాలు పెట్టారని చెబుతున్నా ఒక్కటీ ఎందుకు బయటపెట్టలేదు..? ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. నిజంగానే కెమెరాలు పెట్టి ఉన్నట్లు నిజాలు తీస్తే బాధితుల తరఫున పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.